తిరుమలలో రేపటి నుంచే ఉచిత లడ్డూ…

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు.  గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:50 pm, Sun, 19 January 20
తిరుమలలో రేపటి నుంచే ఉచిత లడ్డూ…

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు.  గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే ఒక్కో లడ్డూకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం తిరుమలలో 12 అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.