AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్రౌపది ఆలయ దర్శనం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

Draupadi Temples in India: హిందూ ధర్మంలో మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. “వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి” అనే నానుడి మన సంస్కృతిలో దీనికి ఉన్న గొప్ప స్థానాన్ని తెలియజేస్తుంది. మహాభారతం కేవలం ఇతిహాసం కాదు, జీవన మార్గదర్శకం కూడా. ఈ మహాగ్రంథంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన స్త్రీమూర్తి ద్రౌపది. రామాయణంలో సీతమ్మలా, మహాభారతంలో ద్రౌపది ధైర్యం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.

ద్రౌపది ఆలయ దర్శనం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు
Draupadi Temple Darshan benefits
Rajashekher G
|

Updated on: May 06, 2026 | 8:47 AM

Share

హిందూ ధర్మంలో మహా భారతంను మనం పంచమ వేదంగా భావిస్తుంటారు. ఇక, ‘వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి’ అనే నానుడి మన తెలుగువారి సంస్కృతిలో మహాభారతానికి ఉన్న గొప్ప స్థానాన్ని తెలియజేస్తుంది. మహాభారతం కేవలం ఇతిహాసం కాదు; అది జీవన విధానానికి మార్గదర్శకంగా నిలిచిన మహాగ్రంథం. ఈ ఇతిహాసంలో ప్రత్యేక గుర్తింపు పొందిన స్త్రీమూర్తి ద్రౌపది (Draupadi). రామాయణంలో సీతమ్మ ఎంత పతివ్రతగా ప్రసిద్ధి చెందిందో, మహాభారతంలో ద్రౌపది అంతే ధైర్యం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఆమెకు అంకితమైన ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.

ద్రౌపది ఎవరు?

పురాణాల ప్రకారం ద్రౌపది అగ్నికుండం నుంచి అవతరించిన “అయోనిజ”.. అంటే గర్భం ద్వారా జన్మించని దివ్య స్త్రీ. ఆమెను “యాజ్ఞసేని” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆమె యజ్ఞం ద్వారా పుట్టింది. మహా భారతం ప్రకారం పాండవుల శక్తిని ఏకం చేసి నడిపించిన ఆధ్యాత్మిక శక్తిగా ద్రౌపది భావించబడుతుంది. ఆమెకు “కృష్ణ” అనే పేరు కూడా ఉంది. మహాభారతంలో ముగ్గురు “కృష్ణులు” ముఖ్యపాత్ర పోషించారని చెబుతారు: వారే.. కృష్ణ (శ్రీకృష్ణుడు), ద్రౌపది, వ్యాస మహర్షి.

ద్రౌపది ఆలయాల ప్రత్యేకత

ద్రౌపదిని దక్షిణ భారతంలో “ద్రౌపది అమ్మన్”గా గ్రామదేవతగా పూజించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. అలాగే విదేశాల్లో కూడా ఆమెకు ఆలయాలు ఉండటం భారతీయ సంస్కృతి విస్తృతిని తెలియజేస్తుంది.

విదేశాల్లో ద్రౌపది ఆలయాలు

సింగపూర్, మలేషియా, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లో ద్రౌపది అమ్మన్ ఆలయాలు ఉన్నాయి. అక్కడి భారతీయ వంశీయులు ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు.

భారతదేశంలో ముఖ్య ద్రౌపది ఆలయాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపది ఆలయం.. నెల్లూరు ములాపేటలో ఉన్న ద్రౌపది ఆలయం స్థానికంగా ప్రసిద్ధి పొందింది.
  • కర్ణాటకలో.. ధర్మరాయ ఆలయం.. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పాండవులతో పాటు ద్రౌపది పూజలందుకుంటుంది.
  • తమిళనాడు..
  • తమిళనాడులో ద్రౌపది అమ్మన్ ఆలయాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా:
  • ద్రౌపది అమ్మన్ టెంపుల్, వేలచెరి
  • ద్రౌపది అమ్మన్ టెంపుల్, ఆలందూరు
  • ద్రౌపది అమ్మన్ టెంపుల్, సైదాపేట్
  • ద్రౌపది రాథ, మహాబలిపురం
  • ద్రౌపది అమ్మన్ టెంపుల్, కుంభకోణం.

భక్తి విశ్వాసం..

ఈ ఆలయాలలో ద్రౌపది అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తారు. ప్రత్యేకంగా తమిళనాడులో జరిగే “తిమితి” (అగ్నిప్రవేశం) ఉత్సవం ద్రౌపది భక్తిలో కీలకమైనది. భక్తుల విశ్వాసం ప్రకారం, జీవితంలో కనీసం ఒక్కసారి అయినా ఈ ఆలయాలను దర్శిస్తే శుభఫలితాలు లభిస్తాయని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us