AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా.. హీరో రాజా షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు హీరోగా మెప్పించి ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యాడు హీరో రాజా. ఆనంద్ సినిమాతో చాలా మంది ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాజా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా.. హీరో రాజా షాకింగ్ కామెంట్స్
Raja
Rajeev Rayala
|

Updated on: May 06, 2026 | 8:53 AM

Share

హీరో రాజా గుర్తున్నాడా.? లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజా.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు రాజా.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాజా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, సేవా కార్యక్రమాలపై తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా ప్రపంచం నుండి వైదొలగాలని ఎప్పుడు అనిపించింది అన్న ప్రశ్నకు సమాధానంగా..  2010లో ఒక చిత్రం విడుదల సందర్భంగా తాను భారీగా నష్టపోయిన ఘటనను ప్రస్తావించారు. నిర్మాతకు 20 లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ, ఆ సినిమా తనకు డబ్బును తిరిగి ఇవ్వలేదని, సినిమా కూడా విజయం సాధించలేదని చెప్పారు. అయితే, విచిత్రంగా అదే చిత్రానికి దర్శకుడికి, కమెడియన్ వెన్నెల కిషోర్‌కు నంది అవార్డులు రావడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి సినీ వ్యవస్థతో పోరాడలేమని, అది తన జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని గ్రహించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారో తెలుసా.?

దాదాపు 30-35 చిత్రాలలో నటించిన రాజా, తాను పెద్ద దర్శకులు లేదా బ్యానర్లతో పని చేయలేకపోవడానికి కారణం తనకు అవకాశాలు రాకపోవడం లేదా తాను అడగకపోవడం అని పేర్కొన్నారు. తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ కారణంగా దర్శకులు తనను వేరే పాత్రలలో ఊహించుకోవడానికి ఇష్టపడలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 2004లో విడుదలైన ఆనంద్ చిత్రం భారీ విజయం సాధించి, రాజాను ఆనంద్ గా మార్చిందని, ఇప్పటికీ చాలామంది తనను ఆనంద్ పేరుతోనే పిలుస్తారని తెలిపారు. ఆనంద్ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పడిన కష్టాలను, సినిమా విడుదల కోసం ఆయన చేసిన కృషిని రాజా వివరించారు. డిస్ట్రిబ్యూటర్లు, శాటిలైట్ హక్కులు, థియేటర్లు దొరకక ఆయన ఎంతో శ్రమించారని, తన సంపాదన అంతా ఆ సినిమాకే ఖర్చు పెట్టారని చెప్పారు. ఆనంద్ తర్వాత వెన్నెల కూడా విజయం సాధించిందని, ఆపై స్టైల్ చిత్రం వచ్చిందని తెలిపారు.

ఇది కూడా చదవండి :ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

తన తొలి చిత్రం ఓ చిన్నదాన ఎలా వచ్చిందో రాజా వివరించారు. ముంబైలో ఉన్నప్పుడు EVV సత్యనారాయణ గారి దృష్టిలో పడటం, నెక్కంటి శ్రీదేవి గారితో కలిసి ఆయన ఒక ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ నిర్వహించడం, ఆ ప్రాజెక్ట్ నిలిచిపోవడం వంటివి జరిగాయి. తర్వాత, EVV సత్యనారాయణ గారి పిల్లలు నరేష్, రాజేష్ ల ద్వారా సత్తిబాబు గారితో పరిచయం ఏర్పడింది. శ్రీకాంత్ కూడా తనను చూసి అంగీకరించడంతో ఓ చిన్నదాన చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. నటుడిగా మారడానికి తనకున్న కోరిక గురించి మాట్లాడుతూ, తాను చిన్నతనం నుంచి పాపులర్ అవ్వాలని. తన తల్లి ఐదేళ్ల వయసులో, తండ్రి 14 ఏళ్ల వయసులో మరణించడంతో తనకు కుటుంబ అండ, ప్రేమ లభించలేదని, సినీ అభిమానుల ద్వారా పొందిన ప్రేమను తాను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి : Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us