వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!

కాస్త ఎక్కువ బ్రేక్స్ వస్తే.. వర్క్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది గోవాకి వెళ్తూంటారు. గోవా అంటేనే వినోదానికి మారు పేరు. ముఖ్యంగా యువకులు గోవాకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రశాంతమైన బీచ్ ఒడ్డున సేదతీరేందుకు ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ విదేశీ టూరిస్టుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది గోవా. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర గోవా సొంతం. నిజానికి గోవా చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ లిక్కర్ యధేచ్ఛగా దొరుకుతుంది. ముఖ్యంగా లిక్కర్ కోసమే […]

వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 2:28 PM

కాస్త ఎక్కువ బ్రేక్స్ వస్తే.. వర్క్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది గోవాకి వెళ్తూంటారు. గోవా అంటేనే వినోదానికి మారు పేరు. ముఖ్యంగా యువకులు గోవాకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రశాంతమైన బీచ్ ఒడ్డున సేదతీరేందుకు ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ విదేశీ టూరిస్టుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది గోవా. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర గోవా సొంతం. నిజానికి గోవా చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ లిక్కర్ యధేచ్ఛగా దొరుకుతుంది. ముఖ్యంగా లిక్కర్ కోసమే గోవా వెళ్తుంటూరు కొంతమంది.

అలాంటి గోవాలో అక్కడ టూరిస్టులకు కూడా తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం:

1. గోవాకి లిక్కర్ సామ్రాజ్యంగా పేరు ఉంది. మరి అలాంటి గోవాలో ఎన్ని బార్లు ఉన్నాయో తెలుసా? 7 వేల బార్లు. అవును మీరు వింటుంది నిజమే. అవన్నీ ప్రభుత్వం లైసెన్స్ కలిగినవే. మరి లైసెన్స్ లేనివి ఎన్నుంటాయో.. ఊహించండి.

2. దేశంలోనే మొదటి మెడికల్ స్కూల్ ఇక్కడే ఉంది. విభిన్న సంస్కృతులు కలగలిసిన గోవాలో ఎంతో ప్రత్యేకత ఉంది. 18 శతాబ్ధంలోనే పోర్చుగీసుల పాలనలో ఇక్కడ మెడికల్ స్కూల్ నిర్మాణం జరిగింది. ఆసియా దేశంలోని అత్యంత పురాతనమైన మెడికల్ కాలేజీ, లైబ్రరీ గోవా సొంతం.

3. కుళ్లిపోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవీయర్ శరీరం. ఆయన గొప్ప సువార్త కర్త. 1542 పోర్చుగీసులు పరిపాలించే సమయంలో ఆయన సువార్త వ్యాప్తికి కృషి చేశారు. ఇప్పటికీ ఓ చర్చిలో ఆయన శరీరాన్ని కుళ్లిపోకుండా ఓ గాజు పేటికలో భద్రపరిచారు.

4. ఆసియాలోనే ఏకైక నేవల్ ఏవియేషన్ మ్యూజియం గోవాలో ఉంది. ఇలాంటివి దేశంలో 6 ఉన్నాయి. కానీ అన్నింటిల్లో ప్రప్రధమమైనది ఇదే.  వైమానిక యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, సమకాలీన యుద్ధ విమానాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు.

5. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం కూడా గోవానే. జాతీయ గణాంకాల ప్రకారం గోవాలోని ఒక వ్యక్తి సగటు ఆదాయం ఏడాదికి రూ.1,92,652లుగా ఉంది. దీంతోనే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుందో.

6. అలాగే గోవాలో టూవీలర్ రైడ్స్, సైకిల్ రైడ్స్‌లు చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఈ రైడ్స్‌ని అతి తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్ చేస్తారు.

7. గోవాలో ఖనిజ ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. 16వ శతాబ్ధం నుంచి ఇప్పటి వరకూ గోవాలో ఇనుము త్రవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

8. మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ని ప్రారంభించింది గోవాలోనే. సముద్ర మార్గం ద్వారా పోర్చుగీసులు ఇక్కడికి చేరుకోవడంతో.. తొలిసారిగా ఇక్కడే ఇంగ్లీషు మీడియం స్కూల్‌ని స్టార్ట్ చేశారు.

9. గోవాలో 30 శాతం అడవులే ఉంటాయి. నేచర్ కూడా ఇక్కడ ఎక్కువే. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువాగా కనిపిస్తాయి. అలాగే సెలబ్రిటీలను ఆకట్టుకునే కేసినోవాలకు ఇక్కడ పెట్టింది పేరు.

10. ఇక గోవాలో ఎక్కడ చూసినా పోర్చుగీసు చరిత్రకు సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. గోవాలో పార్టీ కల్చర్‌తో పాటు ఆలయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి గోవా వెళ్లినప్పుడు వీటిపై మీరూ కూడా ఓ లుక్కేసేయండి.

Latest Articles
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..