AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?..

ప్రస్తుతం న్యాచురల్ స్టార్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నాని కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే లిస్ట్ లో మరో హీరో కూడా ఉన్నారు. హీరో కావాలనుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారు

Nagarjuna: నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?..
Ninne Pelladta
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 11:21 AM

Share

సినీరంగుల ప్రపంచంలో గుర్తింపు కోసం అడుగుపెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్నవారు ఉన్నారు. అయితే హీరో అయ్యేందుకు వచ్చి… కానీ ఆ తర్వాత డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, విలన్స్ గా మారిపోతుంటారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ కూడా నటులుగా ఇమేజ్ తెచ్చుకున్నవారే. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నాని కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే లిస్ట్ లో మరో హీరో కూడా ఉన్నారు. హీరో కావాలనుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారు.. అతడే మాస్ మాహారాజా రవితేజ.

ఎలాంటి సపోర్ట్, బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రవితేజ. దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ వంటి స్టార్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అక్కినేని నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ విషయాన్ని నటుడు బ్రహ్మాజీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే సెట్స్ లో మాస్ మాహారాజా మిమిక్రీ చేస్తూ అందరిని నవ్వించేవాడని అన్నారు.

నిన్నే పెళ్లడతా సినిమాలో నాగార్జున ఓ బైక్ రేసింగ్ సీన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులో ఆ బైక్ సీన్ కోసం నాగ్ జుట్టు పైకి ఎగరడానికి ఫ్యాన్ పట్టుకున్న వారిలో రవితేజ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రవితేజ.. 1997లో కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీతోపాటు సెకండ్ హీరోగా కనిపించాడు. కానీ ఈ మూవీతో రవితేజ పాత్రకు గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచే ఆయనకు ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది. 1999లో శ్రీనువైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ రూపొందించిన ఇడియట్ మూవీ రవితేజకు బ్రేక్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.