ATM: ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? అయితే జాగ్రత్త, అది పెద్ద మోసం..

కొన్ని సందర్భాల్లో మనం ఏటీఎమ్‌ను ఉపయోగించే సమయంలో కార్డు మిషిన్‌లో ఇరుక్కుపోవడం సమస్యను ఎదర్కొనే ఉంటాం. అయితే కొందరు నేరగాళ్లు దీనినే తమ నేరానికి అడ్డాగా మార్చుకున్నారు. ఇంతకీ ఏంటా స్కామ్‌.? అసలు ప్రజలను మోలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ATM: ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? అయితే జాగ్రత్త, అది పెద్ద మోసం..
Atm Card
Follow us

|

Updated on: May 02, 2024 | 11:01 AM

ప్రస్తుతం బ్యాంకుల్లో డబ్బులు విత్‌డ్రా చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఏటీఎమ్‌లు విస్తృతంగా పెరగడంతో వీధికో ఏటీఎమ్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రజల అవసరాలను తీరుస్తున్న ఏటీఎమ్‌లను సైతం నేరగాళ్లు తమకు అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఏటీఎమ్‌ కేంద్రంగా రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో రకం కొత్త మోసం వెలుగులోకి వచ్చింది.

కొన్ని సందర్భాల్లో మనం ఏటీఎమ్‌ను ఉపయోగించే సమయంలో కార్డు మిషిన్‌లో ఇరుక్కుపోవడం సమస్యను ఎదర్కొనే ఉంటాం. అయితే కొందరు నేరగాళ్లు దీనినే తమ నేరానికి అడ్డాగా మార్చుకున్నారు. ఇంతకీ ఏంటా స్కామ్‌.? అసలు ప్రజలను మోలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఇందుకోసం నేరగాళ్లు ముందుగా సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎమ్‌లను ఎంచుకుంటారు. అనంతరం అందులో సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేస్తారు. అనంతం ఏటీఎమ్‌ మెషిన్‌లోనేఇ కార్డ్‌ రీడర్‌ను తొలగిస్తారు. దీంతో ఎవరైనా డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎమ్‌ పెట్టగానే ఇరుక్కుపోతుంది. దీంతో అక్కడే కాచుకొని ఉండే దుండులు లోపలికి ఎంట్రీ ఇస్తారు. సహాయం పేరుతో నమ్మించి పిన్‌ ఎంటర్‌ చేయమని చెప్తారు. ఆ సమయంలో పిన్‌ నెంబర్‌ను నోట్ చేసుకుంటారు. ఇక కార్డు ఎంతకు రావట్లేదని బ్యాంకును సంప్రదించాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతారు.

సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లగానే మళ్లీ తిరిగొచ్చు కార్డును బయటకు తీసి మరో ఏటీఎమ్‌లో ఎంచక్కా డబ్బులను విత్‌డ్రా చేసేస్తారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతుండంతో అధికారులు ప్రజలను అలర్ట్‌ చేశారు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జన సంచారం లేని ఏటీఎమ్‌లలో డబ్బులు విత్‌డ్రా చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే ఏటీఎమ్‌ మిషన్‌లో ఏమైనా తేడా కనిపిస్తే దానికి జోలికి వెళ్లకపోవడమే బెటర్‌ అంటున్నారు. ఇక ఏటీఎమ్‌ విత్‌డ్రా విషయంలో తెలియని వ్యక్తుల సలహాలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles