సోనాలీ బింద్రేకు ఆ స్టార్ క్రికెటర్ లవ్ ప్రపోజల్!

TV9 Telugu

16 May 2024

సోనాలీ బింద్రే గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు నుంచి మెగాస్టార్ చిరంజీవి దాకా అందరి హీరోలతో హిట్లు కొట్టింది.

అటు బాలీవుడ్ లోనూ పలువురి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.

అయితే చాలామంది హీరోయిన్లు వేధించినట్లుగానే మహమ్మారి క్యాన్సర్ ఈ ముద్దుగుమ్మను పట్టి పీడించింది. అయితే మనోధైర్యంతో దానిని జయించింది.

సౌత్ తో పాటు బాలీవుడ్‌ లోనూ ఓ వెలుగు వెలిగిన సోనాలి బింద్రేకు అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఇందులో పాక్ మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడా?

గతంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్ అక్తర్‌  సోనాలీ బింద్రేను  ప్రేమించాడని, పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్‌ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.

తాజాగా   ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే అక్తర్ కామెంట్లపై స్పందించింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసిందీ అందాల తార.

అదే సమయంలో అక్తర్ లాంటి స్టార్ క్రికెటర్ తన అభిమాని కావడం ఎంతో సంతోషంగా ఉందని సోనాలీ బింద్రే మురిసిపోయింది.

కాగా సోనాలి బింద్రేకు సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ కూడా స్పష్టం చేశాడు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానినయ్యానన్నాడు.