పుష్ప 2 నుండి దాక్షాయణి పోస్టర్ రిలీజ్..

Anil Kumar

13 May 2024

అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందులోని పాత్రలు కూడా ఆ రేంజ్ లోనే ప్రాధాన్యత పొందాయి.

ఇందులో సునీల్ భార్యగా నటించిన అనసూయ భరద్వాజ్ అలియాస్ దాక్షాయణి.. ఈ పాత్ర కూడా జనాల్లోకి చొచ్చుకుపోయింది.

బుల్లితెరపై యాంకర్ గా జనాలను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. రంగస్థలం , పుష్ప సినిమాలు ఒక మైలురాయి అని చెప్పొచ్చు.

అయితే అల్లు అర్జున్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ నుంచి మరో క్యారక్టర్ లుక్ ఒకటి విడుదలైంది.

అదే.. అనసూయ అలియాస్ దాక్షాయణి లుక్. హాఫ్ హెయిర్ , పాన్ నములుతూ.. పక్కన మందు బాటిల్ హైలెట్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఈమె లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

అనసూయ పోస్టర్ రిలీజ్ చేసి పుష్ప 2 లో కూడా దాక్షాయణి పాత్ర ఉందని కన్ఫర్మ్ చేసినట్టే అంటున్నారు నెటిజన్స్.

ఈ పాత్రతో ఎంతో ఫెమస్ అయ్యిన అనసూయ మాస్ లుక్ లో ఉన్న ఈ దాక్షాయణి పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.