MLA dumps: వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం చూసిన ఎమ్మెల్యే.. అధికారుల తీరుపై ఆగ్రహించి ఏంచేశాడంటే..?
బెళగావి జిల్లాలోని బెళగావి దక్షిణ శాసనసభా నియోజకవర్గం లో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
MLA dumps garbage in front of commissioner: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని సహించలేకపోయాడు. వారికి నిరసన తెలపాలనుకున్నాడు. అసలే కరోనా కాలం. పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటిది అపరిశుభ్రంగా ఉన్న రోడ్లు, వీధుల వెంబడి పేరుకుపోయిన చెత్తాను చూసిన ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తీసుకువెళ్లి ఏకంగా మున్సిపల్ కమీషనర్ ఇంటి ముందే పోసి నిరసన తెలిపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది.
బెళగావి జిల్లాలోని బెళగావి దక్షిణ శాసనసభా నియోజకవర్గం లో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అభయ్‌పాటిల్ ఒక ట్రాక్టర్ నిండా చెత్తనింపుకుని స్వయంగా తానే డ్రైవ్‌చేస్తూ ఏకంగా బెళగావి నగర పాలికె కమీషనర్ కె. హెచ్.జగదీష్ నివాసం ముందు కుమ్మరించారు. పాలికె ఉన్నతాధికారులకు పరిస్థితి తీవ్రత గురించి తెలియ జెప్పేందుకే తాను ఇలా వినూత్న రీతిలో నిరసన చేపట్టినట్లు ఆయన మీడియాకు చెప్పారు. ప్రజల కోసమే తాను ఈపని చేశానంటూ గట్టిగా సమర్ధించుకున్నారు.
కాగా, ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన నిరసనను మరో విధంగా తెలియజేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పాలికె సిబ్బంది కూడా ఎమ్మెల్యే అభయ్‌పాటిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
Belagavi south MLA @iamabhaypatil dumps waste at the gate of Belagavi City Corporation commissioner’ residence as a protest against mismanagement in handling solid waste in city @TOIBengaluru @KiranParashar21 @sandeepmTOI pic.twitter.com/VB3zdJ86kV
— Shreyas HS (@shreyas_ToI) July 25, 2021