AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections: బీజేపీకి మెజారిటీ సీట్లు రాకున్నా.. హంగ్ అసెంబ్లీ వచ్చినా.. కర్ణాటకలో వచ్చేది బీజేపీ పాలనే.. రెవెన్యూ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఈరోజు కర్నాటక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ రాష్ట్రాన్ని పాలించేది ఎవరో నేడే తెలిసిపోతుంది. ఎవరు గెలుస్తారా అని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో బీజేపీకి సీట్లు తగ్గి.. కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వస్తున్నట్లు చూపించాయి. అలాగే మరికొందరు హంగ్ అసెంబ్లీ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Aravind B
|

Updated on: May 13, 2023 | 8:15 AM

Share

ఈరోజు కర్నాటక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ రాష్ట్రాన్ని పాలించేది ఎవరో నేడే తెలిసిపోతుంది. ఎవరు గెలుస్తారా అని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో బీజేపీకి సీట్లు తగ్గి.. కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వస్తున్నట్లు చూపించాయి. అలాగే మరికొందరు హంగ్ అసెంబ్లీ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అత్యధిక సీట్లు రాకపోయిన కూడా తాము బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వచ్చినా కూడా తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నారు. మెజారిటీ సాధించేందుకు మిగతా ఎమ్మెల్యేల కోసం కేంద్రం నుంచి సహాకారం అవసరం అవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏం చేస్తామో.. ఎలా చేస్తామో ఇలాంటి విషయాలు అడగొద్దంటూ ఓ టీవి ఛానల్‌కు తెలిపారు.

అయితే అశోక్ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక బీజేపీ ప్రతినిధి ఎంజీ మహేష్ స్పందించారు. బీజేపీకే అధిక సీట్లు వస్తాయని.. అసలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశమే లేదని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 113 సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది. మరో ఐదేళ్లు కర్ణాటకను పాలించేది ఎవరో నేడు తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి