AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election 2023: ప్లాన్​బీతో రెడీ.. ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు వ్యూహాలు.. జేడీఎస్ ఎటువైపు..

కర్ణాటక ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో అన్ని పార్టీలు తమదైన వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఫలితం తమకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో డిసైడ్‌ అవుతున్నాయి. బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసి.. ప్లాన్-బీ సైతం సిద్ధంగా ఉందని అంటోంది...? ఏంటా ప్లాన్? ఆపరేషన్ కర్ణాటక రిపీట్ అవుతుందా?

Karnataka Election 2023: ప్లాన్​బీతో రెడీ.. ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు వ్యూహాలు.. జేడీఎస్ ఎటువైపు..
JDS AND BJP
Sanjay Kasula
|

Updated on: May 13, 2023 | 7:24 AM

Share

ఎవరు ఏమనుకున్నా అధికారం మాదే’.. కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్న మాట ఇది! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలాగున్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామెనంటూ అన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగ్ వచ్చినా.. అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసి.. ‘మెజారిటీ రాకపోయినా మాదే అధికారం’ అని చెబుతోంది. ఇందుకు ప్లాన్-బీ సైతం సిద్ధంగా ఉందని అంటోంది. మెజారిటీ స్థానాలు రాకపోతే రాష్ట్రంలో తమ ‘ఆపరేషన్’ ప్రారంభిస్తామని బీజేపీ నేత ఆర్ అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో బీజేపీ నాయకుల్లో వనుకు మొదలైయ్యింది. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే బీజేపీ పాతపాట పాడాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

‘ఆపరేషన్ కమలం’లో ఎమ్మెల్యేలు చిక్కకుండా జాగ్రత్తలు

ఆపరేషన్ కమలాను మరోసారి తెరమీదకు తీసుకురావడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇతర పార్టీల్లో కచ్చితంగా గెలిచే నాయకులతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని కన్నడ మీడియా అంటోంది. మరోవైపు బీజేపీలో టిక్కెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ టిక్కెట్లు సంపాధించి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులతో కూడా బీజేపీ పెద్దలు చర్చలు జరపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలని ఊవిళ్లూరుతున్న

ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ప్రకారం హంగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘ఆపరేషన్ కమలం’లో తమ ఎమ్మెల్యేలు చిక్కకూడదని కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది. ఇక జేడీఎస్.. హంగ్ అసెంబ్లీపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీలో ఎవరికీ మెజారిటీ స్థానాలు రాకపోతే తాము చక్రం తిప్పొచ్చని భావిస్తోంది. కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలని ఊవిళ్లూరుతోంది జేడీఎస్. దీన్ని బట్టి ఎవరికి మద్దతు ప్రకటించినా… సీఎం పదవిని జేడీఎస్ డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తాము ఎవరితో కలవాలో ఇదివరకే నిర్ణయించుకున్నామని జేడీఎస్ చెబుతోంది.

కర్నాటక పోలింగ్ ఫలితాలపై లైవ్ ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం