AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాన్నా ! నువ్వే నా దేవుడు’…..వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసులో ఆ తండ్రి…….!

దక్షిణ కర్ణాటకలోని సుళియా తాలూకా బలాకా గ్రామమది! అక్కడ ఇటీవల కనబడిన దృశ్యం చూస్తే ఆవేదనతో కళ్ళు చెమర్చక మానవు....భోరున వర్షం పడుతుండగా తన కూతురు ఆరు బయట ఆన్ లైన్ క్లాసులకు హాజరయినప్పుడు..

'నాన్నా ! నువ్వే నా దేవుడు'.....వర్షం పడుతుండగా కూతురి  ఆన్ లైన్ క్లాసులో  ఆ తండ్రి.......!
Karnataka Man Hold Umbrella
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 19, 2021 | 8:55 PM

Share

దక్షిణ కర్ణాటకలోని సుళియా తాలూకా బలాకా గ్రామమది! అక్కడ ఇటీవల కనబడిన దృశ్యం చూస్తే ఆవేదనతో కళ్ళు చెమర్చక మానవు….భోరున వర్షం పడుతుండగా తన కూతురు ఆరు బయట ఆన్ లైన్ క్లాసులకు హాజరయినప్పుడు.. ఆమె తడిసిపోకుండా ఆ తండ్రి గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో మరి తెలియదు. ఈ ఫోటోను మహేష్ అనే జర్నలిస్టు షేర్ చేశాడు. ఎస్ఎస్ఎల్సి చదువుతున్న కుమార్తెను ఆ తండ్రి ఇలా వర్షం వేళ ఆదుకున్నాడు. ఆ బాలిక రోజూ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఇదే చోట చదువుకుంటూ కనిపిస్తుందని మహేష్ పేర్కొన్నాడు. దక్షిణ కర్ణాటకలోని అనేక చోట్ల ముఖ్యంగా..గ్రామాల్లో.. ఇంటర్నెట్ కనెక్టివిటీ అతి దారుణంగా..దయనీయంగా ఉంటుంది. తమ ఇళ్లలో నెట్ వర్క్ సరిగా పని చేయక చాలామంది విద్యార్థులు ఇలా ఆరు బయటే ఆన్ లైన్ తరగతులకు హాజరవుతుంటారని ఆ జర్నలిస్టు పేర్కొన్నాడు. ఒక్కోసారి మొబైల్ ఫోన్స్ పని చేయకపోతే మరోసారి పవర్ కట్స్ (విద్యుత్ సరఫరా కష్టాలు) మామూలేనని ఆయన అంటున్నాడు. అందులోనూ వర్షం పడుతున్నప్పుడైతే ఇక చెప్పలేమంటున్నాడు.

కనీసం 3 జీ నెట్ వర్క్ అయినా ఉంటేనే పిల్లలు ఆన్ లైన్ తరగతులకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందని, కానీ అది కూడా ఈ పేద పిల్లలకు గగనమేనని ఆయన దాదాపు వాపోయాడు. బీ ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ అయినా సజావుగా ఉంటుందా అంటే అది కూడా సందేహమే..కానీ ఈ పరిస్థితికి తామేమీ చేయలేమని, వర్షం పడినప్పుడు తాము కూడా నిస్సహాయంగా చేతులెత్తేస్తామని బీ ఎస్ ఎన్ ఎల్ అధికారులు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ముద్దుల కొడుక్కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన ‘రియల్ హీరో’ ! ఏమిటా కథ ? ఏమిటా గిఫ్ట్ ..?

Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో