Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో

అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి శుక్రవారం రాత్రి కరీనా కపూర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో సందడి చేశారు. ఈ మేరకు ఓ వీడియో వైరలవుతోంది.

Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో
Arjun Kapoor And Malaika Arora
Follow us
Venkata Chari

|

Updated on: Jun 19, 2021 | 8:50 PM

Arjun Kapoor: అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి శుక్రవారం రాత్రి కరీనా కపూర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో సందడి చేశారు. ఈ మేరకు ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరూ కలిసి పార్టీ అయ్యాక ఒకే కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. అలాగే మలైకా సోదరి అమృత అరోరా తన భర్త, పిల్లలతో ఈ పార్టీలో సందడి చేసింది. ఈ మేరకు కరీనా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈమేరకు నిన్న రాత్రి జరిగిన పార్టీలో వీరు జంటగా కెమెరా కంటికి చిక్కారు. దీంతో మరోసారి వీరిపై బాలీవుడ్ ఫోకస్ పడింది.

పార్టీ అయ్యాక అర్జున్ కపూర్, మలైకా అరోరాల జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి ఒకే కారులో బయలుదేరారు. ఈపార్టీకి సంబంధించి మలైకా అరోరా.. కరీనాతో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో పంచుకుంటుంది. ఈఫొటోను మలైకా సోదరి అమృత అరోరా తీసినట్లుగా రాసుకొచ్చింది.

2019 లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దీంతో తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అప్పటి నుంచి వారు తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగే పార్టీలకు హాజరవుతుంటారు.

మరోవైపు అర్జున్ కపూర్ తాజా సినిమా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘భూట్ పోలీస్’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’ లో ఓటీటీలోనూ తన హహా చూపిస్తున్నాడు ఈ బాలీవుడ్ హీరో.

Also Read:

Radhe Shyam: ‘రాధేశ్యామ్’ లో ప్ర‌భాస్ కామెడీ నెక్ట్స్ లెవ‌ల్.. హింట్ ఇచ్చిన ఆ క‌మెడియన్

Dhanush New Movie: శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ ఫిక్స్..! సంతోషంగా ఉందంటోన్న కోలీవుడ్‌ స్టార్‌