20 అట్టపెట్టెల్లో రూ.42 కోట్లు దాచిన కాంట్రాక్టర్.. ఎన్నికల కోసమేనా?
కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఏక కాలంలో 12 చోట్ల ఈ దాడులు కొనసాగించారు. కర్ణాటకకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.

కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఏక కాలంలో 12 చోట్ల ఈ దాడులు కొనసాగించారు. కర్ణాటకకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికానాథ్ నివాసంతో పాటు పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై దాడ చేసి తనిఖీలు నిర్వహించారు.
అంబికానాథ్ నివాసంలో నుండి 20 అట్టపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సుమారు 42 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఐటీఅధికారులు గుర్తించారు..ఇలా మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాల నుండి ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము అంతా అంబికానాథ్ కు చెందిన ఒక ఫ్లాట్‌లో దాచినట్లు గుర్తించారు. ఈ ఫ్లాట్ తాళం చెవి ఐటీ అధికారులకు ఇచ్చేందుకు మొదట అంబికానాథ్ నిరాకరించాడు. ఎట్టకేల ఆ ఫ్లాట్ తెరిచిన అధికారులు నోట్ల కట్టలు ఉన్న పెట్టెలను చూసి షాక్ అయ్యారు.
డబ్బంతా తెలంగాణకు తరలించేందుకు స్కెచ్
కర్ణాటకలో పట్టుబడిన ఈ డబ్బంతా తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేసినట్లు విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు 25 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని కర్ణాటక భారతీయ జనతా పార్టీ నేత మునిరత్న ఆరోపించారు. గతంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికానాథ్ ఇంటిపై ఇప్పుడు ఐటీ సోదాలు జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ల ఆరోపణలపై అప్పటి బీజేపీ మంత్రి మునిరత్న డిఫర్మేషన్ కేసు దాఖలు చేశారు. ఆ కేసులో అంబికానాథ్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదల అయ్యారు.
రూ.100 కోట్లు తెలంగాణకు తరలించారనుకున్నారుః బీజేపీ నేత మునిరత్న
తాజాగా అక్టోబర్ 13న ఉదయం నుండి కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పట్టుబడుతున్న డబ్బు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లేనని కర్ణాటక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ డబ్బులు పంచాలని కాంగ్రెస్ భావించిందనీ, నవంబర్ 9 లోపు 100 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించారనుకుంటున్నారని కర్ణాటక బీజేపీ నేత మునిరత్న ఆరోపించారు. ఒక మీటింగ్ దృష్ట్యా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, ఐటీ సోదాలపై ఈ విధంగా స్పందించారు.
తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది -హరీష్ రావు
మరోవైపు ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ డబ్బులు బయటపడ్డాయని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని హరీష్ విరుచుకుపడ్డారు. గతంలో కర్ణాటకలో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉందన్న ఆయన.. ప్రస్తుతం 50 శాతం కమిషన్ నడుస్తుందని ఆరోపించారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు డబ్బులు తరలిస్తున్నారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
