కర్ణాటకలో కోతులకు విషమిచ్చి చంపిన ఘటనపై హైకోర్టు సీరియస్..సుమోటోగా కేసు విచారణ
కర్ణాటక లోని హసన్ జిల్లాలో 38 కోతులకు విషమిచ్చి చంపి వాటి డెడ్ బాడీలను గోనె సంచుల్లో కుక్కిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై దాఖలైన 'పిల్' ను పురస్కరించుకుని ఈ కేసును సుమోటోగా...
కర్ణాటక లోని హసన్ జిల్లాలో 38 కోతులకు విషమిచ్చి చంపి వాటి డెడ్ బాడీలను గోనె సంచుల్లో కుక్కిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై దాఖలైన ‘పిల్’ ను పురస్కరించుకుని ఈ కేసును సుమోటోగా విచారించాలని నిర్ణయించింది. ఈ ఘటనకు సంబంధించి కోర్టు గత నెల 30 న జిల్లా అధికారులను, అటవీ శాఖను, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డును ప్రతివాదులుగా పేర్కొంది. చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ ఎన్.ఎస్. సంజయ్ గౌడతో కూడిన బెంచ్ దీన్ని దారుణమైన ఘటనగా అభివర్ణించింది. ఈ కేసును సుమోటో పిల్ గా రిజిస్టర్ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ని బెంచ్ ఆదేశించింది. గత గురువారం రోడ్డుపై కొన్ని గోనె సంచులను చూసిన ఓ వ్యక్తి.. ఒకదాన్ని విప్పి చూడగా అందులో కోతుల మృతదేహాలను చూసి వెంటనే గాభరా పడ్డాడు. ఈ విషయాన్నీ [పోలీసులకు అధికారులకు తెలియజేశాడు. నోరు లేని ఈ మూగజీవాలను ఇంత క్రూరంగా చంపారని స్థానికులు కంట తడి పెట్టారు.
కాగా ఈ నెల 4 న ఈ కేసు విచారణ జరగాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. ఇలా ఉండగా గొనె సంచుల్లో కుక్కిన వానరాల్లో కొన్ని బతికే ఉన్నాయని, వాటికి స్థానికులు నీరు ఇచ్చి చిన్నపాటి చికిత్సలు చేయడంతో కోలుకున్నాయని తెలిసింది. కోతులను దారుణంగా చంపినవారి ఆచూకీ తెలియజేసినవారికి తాను కొంత సొమ్ము బహుమతిగా ఇస్తానని స్థానిక జంతు పరిరక్షణ సమితి సభ్యుడొకరు ప్రకటించారు. ఏమైనా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్ పెట్టుకోలేదని..:Police attack Video.
పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.
పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.