Karnataka: ఎన్నికల హామీలను నెరవేర్చిన సిద్ధరామయ్య సర్కార్.. శివమొగ్గలో యువనిధి పథకం ప్రారంభం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఐదవ ఉచిత హామీ, యువ నిధి పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శివమొగ్గలోని ఫ్రీడం పార్క్‌లో ప్రారంభించారు. బీజేపీ కంచుకోట అయిన శివమొగ్గలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. శివమొగ్గ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మధు బంగారప్పతో సహా వివిధ మంత్రులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఐదవ ఉచిత హామీ, యువ నిధి పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శివమొగ్గలోని ఫ్రీడం పార్క్‌లో ప్రారంభించారు. బీజేపీ కంచుకోట అయిన శివమొగ్గలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. శివమొగ్గ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మధు బంగారప్పతో సహా వివిధ మంత్రులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యువ నిధి యోజన ప్రారంభించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఐదు హామీలను అమలు చేసింది.
నిరుద్యోగ యువకులకు ఆర్థిక సహాయానికి హామీ ఇచ్చే యువ నిధి పథకాన్ని ప్రారంభించారు. నిరుద్యోగ భృతిని డిగ్రీ హోల్డర్లకు రూ.3,000, డిప్లొమా హోల్డర్లకు రూ.1,500 అందజేయనున్నారు. సీఎం, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు ఏడుగురు లబ్ధిదారులకు యువ నిధి చెక్కులను లాంఛనంగా అందజేసి నిరుద్యోగ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించారు. చిత్రదుర్గ, హావేరి, చిక్కమగళూరు, దావణగెరె, ఉత్తర కన్నడ సహా ఇతర జిల్లాల నుంచి వచ్చిన లక్షలాది మంది ప్రజలు యువ నిధి యోజన ప్రారంభోత్సవం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇంత వరకు యువనేస్తం పథకం అమలు కాలేదన్నారు. నిరుద్యోగ యువతను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో రోజువారీ వినియోగం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, జనాలకు కొనుగోలు శక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సుంకాన్ని తగ్గించి దేశ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చింది. ఇది చారిత్రాత్మకమైన రోజు.’’ అని సీఎం చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
గత ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఐదు హామీలలో యువ నిధి ఒకటి. ‘శక్తి’ పథకం, ‘గృహ జ్యోతి,’ ‘గృహలక్ష్మి’, ‘అన్న భాగ్య’ పథకాలు ఇప్పటికే సిద్దరామయ్య సర్కార్ అమలు చేసిన ఇతర నాలుగు వాగ్దానాలు. డిసెంబర్ 26న విధానసౌధలో యువ నిధి పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు. 2023లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకులు ఈ పథకానికి అర్హులు. మిగిలిన ఏడాది కాలానికి గానూ సీఎం సిద్ధరామయ్య సర్కార్ రూ. 250 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఐదు లక్షల అంచనా లబ్ధిదారులలో 60 వేల మందికి పైగా ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇదిలావుంటే శివమొగ్గలోని ఫ్రీడం పార్క్ పేరును ప్రముఖ కవి, లింగాయత్ ఉద్యమ పోషకుడు అల్లామ ప్రభు పార్క్‌గా మారుస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువ నిధిని ప్రారంభించారు. ఐదు హామీలను అమలు చేశామని చెప్పి ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
రెండు రోజుల క్రితమే ప్రభుత్వం హామీ పథకాల అమలుకు కమిటీ వేసి ఆ కమిటీ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జిల్లా, తాలూకా స్థాయిల్లో కార్యకర్తలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…