ఆయోధ్య రామమందిరానికి కులమతాలకు అతీతంగా విరాళాలు.. ఆ రాష్ట్ర క్రైస్తవ సంఘం విరాళం ఎంతో తెలుసా..?

శ్రీరాముడి జన్మస్థలం అయధ్యలో శ్రీ రామజన్మ భూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో భవ్య రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్మిస్తున్న రామ మందిరానికి అంతే స్థాయిలో విరాళాలు సమర్పిస్తున్నారు భక్తులు. పలు హిందూ సంఘాలు, శ్రీరాముడి భక్తులు వారికి తోచిన కాడిని విరాళాలు సమర్పిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి కుల, మతాలకు అతీతంగా విరాళాలు సమర్పిస్తూ దైవ భక్తికి హద్దులు లేవని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో […]

ఆయోధ్య రామమందిరానికి కులమతాలకు అతీతంగా విరాళాలు.. ఆ రాష్ట్ర క్రైస్తవ సంఘం విరాళం ఎంతో తెలుసా..?
Follow us
K Sammaiah

|

Updated on: Feb 08, 2021 | 3:10 PM

శ్రీరాముడి జన్మస్థలం అయధ్యలో శ్రీ రామజన్మ భూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో భవ్య రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్మిస్తున్న రామ మందిరానికి అంతే స్థాయిలో విరాళాలు సమర్పిస్తున్నారు భక్తులు. పలు హిందూ సంఘాలు, శ్రీరాముడి భక్తులు వారికి తోచిన కాడిని విరాళాలు సమర్పిస్తున్నారు.

రామ మందిర నిర్మాణానికి కుల, మతాలకు అతీతంగా విరాళాలు సమర్పిస్తూ దైవ భక్తికి హద్దులు లేవని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్‌ సీ.ఎన్‌.అశ్వత్థనారాయణ బెంగుళూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్‌ఆర్‌ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. క్రైస్తవ వర్గాలు సుమారు రూ.కోటి వరకు విరాళంగా సమర్పించారని చెప్పారు.

Read more:

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇంచార్జ్‌లు ఖరారు.. ఏయే జిల్లాకు ఇంచార్జ్ ఎవరో తెలుసా..?