AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఉత్తరాఖండ్ జలప్రళయంపై స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్… వారంతా క్షేమంగా బయటపడాలని కోరుకుంటూ..

Mahesh Tweet On Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో మంచు చరియలు ఒక్కసారిగా విరిగి పడడంతో గంగానది ఉపనది ధౌలీగంగా నదికి వరద ఒక్కసారిగా పోటెత్తిన విషయం తెలిసిందే...

Mahesh Babu: ఉత్తరాఖండ్ జలప్రళయంపై స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్... వారంతా క్షేమంగా బయటపడాలని కోరుకుంటూ..
Narender Vaitla
|

Updated on: Feb 08, 2021 | 3:37 PM

Share

Mahesh Tweet On Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో మంచు చరియలు ఒక్కసారిగా విరిగి పడడంతో గంగానది ఉపనది ధౌలీగంగాకు వరద ఒక్కసారిగా పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ జలప్రళయం ఉత్తరాఖండ్‌ను అతలాకుతం చేసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో చాలా మంది వరదల్లో చిక్కుకుపోయారు. నదిపై నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసంకావడంతో పాటు దాదాపు 200 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటనపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్పందించారు. ఈ విషయమై టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఉత్తరాఖండ్ జలప్రళయంపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేసిన ప్రిన్స్.. ‘ఉత్తరాఖండ్ సంఘటనలో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాను. నేను వారి గురించే ఆలోచిస్తున్నాను. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఐటీబీపీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌లో జరిగిన జలప్రళయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో జనాలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: Samantha New Movie Update: పాన్ ఇండియా లెవెల్లో సమంత సినిమా.. ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?