Karnataka CM: కొలిక్కి వచ్చిన కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 27, 2021 | 4:13 PM

లింగాయత్‌ల మద్దతున్న యడియూరప్పను సాగనంపిన భారతీయ జనతా పార్టీ... మరి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఎవర్ని కూర్చోబెట్టబోతోంది? అన్ని అర్హతలూ ఉన్న నేతగా ఎవర్ని ఎంచుకుంటోంది?

Karnataka CM: కొలిక్కి వచ్చిన కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?
Next Cm Of Karnataka

Karnataka New Chief Minister: లింగాయత్‌ల మద్దతున్న యడియూరప్పను సాగనంపిన భారతీయ జనతా పార్టీ… మరి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఎవర్ని కూర్చోబెట్టబోతోంది? అన్ని అర్హతలూ ఉన్న నేతగా ఎవర్ని ఎంచుకుంటోంది?

కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్ప శకం ముగియడంతో… కొత్త శాసన సభా పక్ష నేత ఎవరన్నది ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీలో అగ్రనేతలు డిసైడ్ చెయ్యనున్నారు. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై బోలెడు ఊహాగానాలు వస్తున్నాయి. వాటిలో విశ్వసనీయ వర్గాల ప్రకారం… బీఎల్ సంతోష్ పేరు ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. కర్ణాటక నెక్ట్స్ సీఎంగా ఇవాళ గానీ… రేపు గానీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం సంతోష్ పేరు ఆల్రెడీ ఫైనల్ అయిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్.. పార్టీ అధిష్టానం ప్రతినిధులు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి.కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు చేరి… విషయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

54 ఏళ్ల సంతోష్… చదువులో మెరిట్ స్టూడెంట్. కర్ణాకటలోని సూరత్కల్‌లోని ప్రతిష్టాత్మక రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. RSS ప్రచారక్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సంతోష్ అంచెలంచెలుగా బీజేపీలో చేరారు. కర్ణాటకలో బీజేపీ జనరల్ సెక్రెటరీగా పార్టీ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కిందట… జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

బ్రహ్మచారి అయిన సంతోష్… అత్యంత సాదాసీదాగా గొప్ప రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. పెద్దగా హంగు ఆర్భాటాలకు పోకుండా.. లోప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. కర్ణాటకలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కార్యకర్తలకూ ఆయన సుపరిచితులు. క్షేత్రస్థాయి వరకూ ఆయన పార్టీలో పనిచేశారు. పార్టీ శ్రేణులు ఆయన్ను సంతోష్ జీ అని పిలుచుకుంటారు. ఆయన సోమవారం బెంగళూరు చేరుకున్నారు.

మరోవైపు, జేడీఎస్ నేత HD రేవన్నతో… బీజేపీ నేతలు, సంతోష్ టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించాక… బీజేపీలో ఎలాంటి వివాదమూ రాకుండా… ఎవరూ రెబెల్స్‌గా మారకుండా… ముందుగానే రేవన్నతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిస్తోంది. అటు, అసెంబ్లీలోని జేడీస్ డిప్యూటీ లీడర్ బండెప్ప కషేంపూర్ కూడా… నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉండి సోమవారం కర్ణాటకకు వచ్చారు.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న యడియూరప్ప… జేడీఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో తమ కాల పరిమితి పూర్తయ్యాక… బీజేపీకి అధికారాన్ని అప్పగించడానికి జేడీఎస్ ముందుకు రాలేదు. దీంతో 2008లో యడియూరప్ప చిక్కుల్లో పడ్డారు. అప్పటి నుంచి ఆయన జేడీఎస్‌పై గుర్రుగానే ఉన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ అధిష్టానం అచితూచి వ్యవహరిస్తోంది. అందరిని కలుపుకునిపోయే వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. ఇదే క్రమంలో సంతోష్ పేరు ప్రకటిస్తే.. పార్టీలో లుకలుకలేవీ రావని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న యడియూరప్ప… జేడీఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే… ఇదివరకు… బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో… తమ కాల పరిమితి పూర్తయ్యాక… బీజేపీకి అధికారాన్ని అప్పగించడానికి జేడీఎస్ ముందుకు రాలేదు. దాంతో… 2008లో యడియూరప్ప చిక్కుల్లో పడ్డారు. అప్పటి నుంచి ఆయన జేడీఎస్‌పై గుర్రుగానే ఉన్నారు. సంతోష్ పేరు ప్రకటిస్తే… పార్టీలో లుకలుకలేవీ రావని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

Read Also…  CM BS Yediyurappa: కర్ణాటక సీఎం యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. రాజీనామా జీర్ణించుకోలేక దారుణం..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu