భివాండీ ఘటన పుల్వామా దాడి వంటిదే, కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భివాండీలో భవనం కూలిన ఘటనను పుల్వామా దాడితో పోల్చింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేను, శివసేన నేత సంజయ్ రౌత్ ను దుయ్యబట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే భివాండీలో..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భివాండీలో భవనం కూలిన ఘటనను పుల్వామా దాడితో పోల్చింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేను, శివసేన నేత సంజయ్ రౌత్ ను దుయ్యబట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే భివాండీలో భవనం కూలి సుమారు 50 మంది మరణించారని ఆమె ట్వీట్ చేసింది. ఈ పురాతన భవనంపై మీరు దృష్టి పెట్టి ఉంటే ఇంతమంది మరణించి ఉండేవారు కారని, అక్రమంగా నా ఆఫీసును కూల్చివేసే బదులు ఇలాంటి బిల్డింగులపై ఎందుకు ఫోకస్ పెట్టరని కంగనా ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యం కారణంగా పుల్వామా ఎటాక్ లో మరణించిన జవాన్లకన్నా ఎక్కువమంది ఈ బిల్డింగ్ కూలిన ప్రమాదంలో మృతి చెందారని ఆమె పేర్కొంది. అసలు ముంబై నగరానికి ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి అని ఆమె వ్యాఖ్యానించింది.
భివాండీ ఘటనలో 10 మంది పిల్లలతో సహా కనీసం 41 మంది మృతి చెందారు.