ఝార్ఖండ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో కార్డియాక్ అరెస్ట్‌తో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి.. మాములుగానే ఉందని.. అయితే అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. కాసేపటి తర్వాత.. అయన్ను అబ్జర్వేషన్ నుంచి మరో వార్డుకు తరలిస్తామన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రిమ్స్ డైరక్టర్ డీకే సింగ్ స్పందించారు. ప్రస్తుతం దీపక్ ప్రకాశ్ పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
ఇక దీపక్ ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే.. సీఎం హేమంత్ సోరెన్, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు.. ఇతర కేబినెట్ మంత్రులు వెంటనే రిమ్స్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. దీపక్ ప్రకాశ్‌ను కలిశానని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని.. తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని సీఎం పేర్కొన్నారు.