ఇండియాలో పలు ప్రాజెక్టులకు జపాన్ భారీ ఆర్ధిక సాయం, ఢిల్లీ మెట్రో నాలుగోదశకు కూడా !

ఇండియాలో పలు కీలక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు  జపాన్ భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.  200 కోట్లకు పైగా (2.11 బిలియన్ డాలర్లు) ఫైనాన్షియల్ హెల్ప్ కింద  ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు...

ఇండియాలో పలు ప్రాజెక్టులకు జపాన్ భారీ ఆర్ధిక సాయం, ఢిల్లీ మెట్రో నాలుగోదశకు కూడా !
Japan To Provide Loans And Grant For India 2 Billion Dollars
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2021 | 11:28 AM

ఇండియాలో పలు కీలక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు  జపాన్ భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.  200 కోట్లకు పైగా (2.11 బిలియన్ డాలర్లు) ఫైనాన్షియల్ హెల్ప్ కింద  ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు  జపాన్ ప్రభుత్వం ప్రకటించింది, ఇందులో ఢిల్లీ మెట్రో నాలుగో దశకు ఉద్దేశించిన సాయం కూడా ఉంది. బెంగుళూరు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు 52.03 బిలియన్ యెన్ లు, ఢిల్లీ మెట్రో నాలుగో దశకు 119.97 బిలియన్ యెన్ లు విడుదల కానున్నాయి. ఢిల్లీ మెట్రోకు మొదటి నుంచీ జపాన్ సాయం చేస్తూ వస్తోంది. 1997 నుంచి ఓడీయే రుణం కింద సుమారు 47 వేలకోట్ల సాయం లభించింది. హిమాచల్ ప్రదేశ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోషన్ రెండో దశ  ప్రాజెక్టుకు 11.30 బిలియన్ యెన్ ల ఆర్ధిక సాయం లభించబోతోంది. రాజస్థాన్ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ రెండో దశకు, ఫ్లోరోసిస్ మిటిగేషన్ (నివారణ) కు కూడా జపాన్ నుంచి  45.816 బిలియన్ యెన్ లు అందనున్నాయి. ముఖ్యంగా  రాజస్థాన్ లోని రెండు జిల్లాలలో (జునిజ్ను, బార్మర్)  గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఈ సాయం ఉద్దేశించినది.

అండమాన్ నికోబార్  దీవుల్లో పవర్ సప్లయ్ ప్రాజెక్టులకు  4.01 బిలియన్ యెన్ రుణం లభిస్తుందని జపాన్ ఎంబసీ తెలిపింది.  ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి సీ.ఎస్. మహాపాత్ర, జపాన్ రాయబారి సతోషి సుజుకీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన ఈ రుణసాయం తాలూకు ఒడంబడిక కుదిరింది. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు ఉద్దేశించి ఇండియాకు ఈ భారీ ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నట్టు జపాన్ ప్రకటించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.

Telangana: లాక్ డౌన్ పెట్టేది లేదు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ( వీడియో )

భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు…!! దీనికి ఆ నౌకే కారణం… ( వీడియో )