AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constitution Day: జమ్మూ కాశ్మీర్ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. గవర్నర్ ఆధ్వర్యంలో తొలిసారిగా రాజ్యాంగ దినోత్సవం!

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయే వరకు ప్రత్యేక రాజ్యాంగం, ఎజెండా అమలులో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాన్ని లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.

Constitution Day: జమ్మూ కాశ్మీర్ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. గవర్నర్ ఆధ్వర్యంలో తొలిసారిగా రాజ్యాంగ దినోత్సవం!
Jammu And Kashmir
Balaraju Goud
|

Updated on: Nov 26, 2024 | 1:26 PM

Share

నవంబర్ 26, 1950న రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ రోజును జమ్మూ కాశ్మీర్‌లో రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

శ్రీనగర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాయకత్వం ఘనంగా రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉమ్రా (హజ్ కాని తీర్థయాత్ర) కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు బయలుదేరినందున ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం.

రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తి కావడం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రధాన విలువలను పునరుద్ఘాటించడానికి, పౌరులు తమ సరైన పాత్రను పోషించేలా ప్రేరేపించడానికి ఈ కార్యక్రమాన్ని గొప్ప ఉత్సాహంతో జరుపుకోవాలని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ నిర్ణయించడం జరిగింది. హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అంటూ 75 సంవత్సరాల జ్ఞాపకార్థం సంవత్సరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అని ప్రభుత్వం పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో శ్రీనగర్‌లోని SKICCలో ఏకకాలంలో పీఠిక పఠన వేడుకను నిర్వహించారు. అలాగే జమ్మూ, కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థలు, విద్యా సంస్థలు ఇలాంటి వేడుకలను నిర్వహించాయి.

అక్టోబర్ 16న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒమర్ అబ్దుల్లా భారత రాజ్యాంగానికి విధేయుడిగా ప్రమాణం చేసిన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అతని మునుపటి 17 మంది ముఖ్యమంత్రులు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగానికి విధేయత చూపుతూ ప్రమాణం చేయడం విశేషం.

జమ్మూ , కాశ్మీర్ దాని స్వంత రాజ్యాంగం ఎజెండాతో పనిచేస్తుంది. 1965లో దాని ప్రభుత్వాధినేత ప్రధానమంత్రిగా, దేశాధినేత సదర్-ఎ-రియాసత్ (అధ్యక్షుడు)గా నియమితులయ్యారు. అయితే, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయే వరకు రాజ్యాంగం, ఎజెండా అమలులో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాన్ని లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.

మనం ప్రతి సంవత్సరం రాజ్యాంగాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? వాస్తవానికి, రాజ్యాంగ దినోత్సవాన్ని భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, రాజ్యాంగం ప్రాముఖ్యత, అంబేద్కర్ ఆలోచనలు, భావనలను వ్యాప్తి చేసే లక్ష్యంతో జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిజానికి 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం 26 జనవరి 1949న తయారు చేయడం జరిగింది. అయితే ఇది అధికారికంగా 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

ఇదిలావుంటే, 2015వ సంవత్సరం రాజ్యాంగ నిర్మాత డా.భీంరావు అంబేద్కర్ 125వ జయంతి. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...