28 December 2024

ఇంటర్ ఫెయిల్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఆమె. చదివింది ఇంటర్.. కానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అలియా భట్. డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసింది.

ఇటీవల గంగూబాయి కతియావాడి సినిమాలో తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది అలియా భట్. 

 డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ తెలుగువారికి దగ్గరయ్యింది. 

ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం తీసుకుంది అలియా భట్. కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొందట. 

అలాగే ఇప్పుడు హిందీలో ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. చివరగా జిగ్రా సినిమాలో నటించింది. 

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది అలియా. చాలా కాలం ప్రేమలో ఉన్న తర్వాత వీరి మ్యారేజ్ చేసుకున్నారు.