మహారాష్ట్ర CM పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దాదాపు ఖరారు!

ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖ సమర్పించారు షిండే.

మహారాష్ట్ర CM పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దాదాపు ఖరారు!
Eknath Shinde Resigns From Cm Post
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 26, 2024 | 1:03 PM

మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఫడ్నవిస్‌, షిండే మధ్య కుర్చీ నీదానీదా అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. అయితే, ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు షిండే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం షిండే తన రాజీనామాను అందజేశారు.

మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. గవర్నర్ రాజీనామాను ఆమోదించి, కొత్త ముఖ్యమంత్రిని నియమించే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండేను నియమిస్తూ లేఖను అందజేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని గవర్నర్ ఏక్నాథ్ షిండేను ఆదేశించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాకూటమి విజయం సాధించింది. నవంబర్ 23 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. అదే సమయంలో, మహా వికాస్ అఘాడిలో చేరిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) గరిష్టంగా 20 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 16 స్థానాలు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌చంద్ర పవార్‌) 10 స్థానాల్లో గెలుపొందాయి. సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి సంబంధించి ముంబైలో పలు దఫాలుగా సమావేశాలు జరిగినా ఢిల్లీలో ఖరారు కావాల్సి ఉంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరినీ కలవకుండా ముంబైకి తిరిగి వచ్చారు. బీజేపీ అగ్రనేతలెవరినీ ఆయన కలవలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఫడ్నవీస్ తిరిగి విమానాశ్రయానికి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించింది. గెలుపు తర్వాత సీఎం ఎవరన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈరోజు సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని తర్వాత మహారాష్ట్రలో ఎవరి హస్తం ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవీస్‌ సీఎం అవుతారా లేక ఏక్‌నాథ్ షిండేకు కమాండ్‌ వస్తుందా.. లేక అధికారం వేరొకరికి దక్కుతుందా అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయించలేదు.

మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఫడ్నవిస్‌, షిండే మధ్య కుర్చీ నీదానీదా అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. కీలక సమయంలో సంచలన ట్వీట్‌ చేశారు ఏక్‌నాథ్‌ షిండ్‌. తనను కలవడానికి రావొద్దంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. తన ఇంటి ముందు హడావిడి చేయొద్దంటూ నేతలకు సూచించారు. కొత్త సీఎంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో షిండే కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

సీట్ల పరంగా బీజేపీ అతిపెద్ద పార్టీ

మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 57 సీట్లు, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీ, అందుకే బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తోంది. అయితే ఇంకా ఎవరన్న దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి బలమైన నేతగా పరిగణిస్తున్నారు.

మహాయుతి ఏకనాథ్ షిండే నాయకత్వంలో మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, రాజకీయ సమీకరణాలను సెట్ చేయడం ఫడ్నవీస్‌గా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాయుతికి తన వ్యూహంతో రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని అందించారు ఫడ్నవీస్. 2019లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే కూటమిని విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్, ఎన్‌సిపితో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అయితే, మీడియా కథనాల ప్రకారం, భారతీయ జనత పార్టీకి సీఎం పదవిని ఇవ్వాలని మహాకూటమిలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ నుండి ఈ బాధ్యతను పొందవచ్చని తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఒక్కో డిప్యూటీ సీఎం ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో సీఎం పదవి కోసం బీజేపీ, శివసేన మధ్య పోటీ నెలకొంది. నిజానికి ఏకనాథ్ షిండేను సీఎం చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ బీహార్‌లో నితీష్ కుమార్‌ను సీఎం చేసిన బీహార్ ఫార్ములా మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఏడుగురు శివసేన ఎంపీలు కూడా ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..