AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మంచుతో నిండిన రోడ్డుపై ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డను కాపాడేందుకు శ్రమించిన స్థానికులు..

బస్సులోనో, రైలులోనో ప్రయాణిస్తున్న గర్భిణీ స్త్రీలు ప్రసవించిన వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే హిమపాతం కురుస్తుండడంతో రోడ్డు మొత్తం మంచుతో నిండిపోయి.. సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ఓ గర్భిణి చలిలో మార్గమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. జమ్ముకశ్మీర్లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది.

Viral News: మంచుతో నిండిన రోడ్డుపై ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డను కాపాడేందుకు శ్రమించిన స్థానికులు..
Viral News
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 12:05 PM

Share

శీతాకాలం మొదలైంది. ఈ సమయంలో ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తుంది. హిమాచల్ నుంచి ఉత్తరాఖండ్ వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కొన్ని ప్రదేశాలలో భారీగా మంచు వర్షం కురుస్తుంది. ఈ హిమపాతం కురుస్తున్న దృశ్యం పర్యాటకులకు అద్భుతంగా ఉండి కనుల విందు చేస్తుంది.. అదే సమయంలో స్థానిక నివాసితుల బాధలు చెప్పనలవి కావు. దీనికి ఉదాహరణగా నిలుస్తుంది ఇటీవల జరిగిన ఒక ఘటన. ఒక గర్భిణీ స్త్రీ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మంచుతో నిండిన రహదారిపై బిడ్డకు జన్మనిచ్చింది. హృదయ విదారకమైన ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఘటన కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జిల్లలో అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుంది. దీంతో రోడ్లపై మంచు పేరుకుపోయింది. ఈ కారణంగా సకాలంలో గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి చేరుకోలేక మధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చింది.

నివేదికల ప్రకారం మాచిల్ వ్యాలీకి చెందిన మహిళకు ఆదివారం (నవంబర్ 24) నొప్పులు రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రోడ్డుపై మంచు కురుస్తుండటంతో సకాలంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళలేకపోయారు. దీంతో మార్గమధ్యంలోనే.. మంచులో చలికి ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. గర్భిణికి అత్యవసర సేవలు అందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పరిపాలన అధికారుల నిర్లక్ష్యమే దీనంతటికీ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ ప్రాంతంలో సరిపడా ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవని.. ఆరోగ్య కేంద్రం ఉంది కానీ వైద్యులు లేరని స్థానిక నివాసి ముహమ్మద్ జమాల్ లోన్ ఆరోపించారు. అలాగే సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో తల్లీబిడ్డను కాపాడేందుకు గంటల తరబడి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికైనా రోడ్లపై మంచు తొలగింపు సక్రమంగా నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య సదుపాయాలు, సేవలను మెరుగుపరచాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..