AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26/11 Attacks: ముంబైలో ఆ ఉగ్రదాడి జరిగి 14 ఏళ్లు.. ఇంకా మాయని గాయాలతో, చెరగని జ్ఞాపకాలతో..

ముంబైలో 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులు  జరిగి నేటికి 14 సంవత్సరాలు. కాలం పరుగులు తీస్తున్నా ఆ దాడులు మిగిల్చిన గాయాలు దేశంలోని అనేకమంది హృదయాలను ఇంకా

26/11 Attacks: ముంబైలో ఆ ఉగ్రదాడి జరిగి 14 ఏళ్లు.. ఇంకా మాయని గాయాలతో, చెరగని జ్ఞాపకాలతో..
Mumbai 26 11 Terrorist Atta
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 26, 2022 | 9:09 AM

Share

ముంబైలో 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులు  జరిగి నేటికి 14 సంవత్సరాలు. కాలం పరుగులు తీస్తున్నా ఆ దాడులు మిగిల్చిన గాయాలు దేశంలోని అనేకమంది హృదయాలను ఇంకా వీడనేలేదు. ప్రాణాలతో బయటపడిన వారికీ, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని ఆ ఘటన నేటికీ వెంటాడుతూనే ఉంటుంది. దాడులు జరిగే నాటికి తొమ్మిదేళ్ల 11 నెలల వయసున్న దేవికా రోటవాన్‌.. ఆ నాటి దృశ్యాలు నేటికి తన కళ్ల ముందు మెదులుతుంటాయిన చెప్తుంటారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో జరిగిన విచక్షణారహిత కాల్పుల్లో  ఆమె కుడి కాలికి బుల్లెట్ గాయం అయింది. ఇలా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారు, ఇంకా గాయపడి నేటికీ బాధ పడేవారు ఎందరో  ఉన్నారు. ఘటనకు కారణమైనవారిలో ఒకడైన కసబ్‌కు భారత ప్రభుత్వం, న్యాయస్థానం 2012 నవంబర్ 21 ఉరిశిక్ష విధించింది. కసబ్‌ను శిక్షించినప్పటికీ అసలు కారకులను శిక్షించేవరకు తమకు న్యాయం జరగనట్లే అని ఆ దాడులలో బంధువులను కోల్పోయినవారు, గాయపడినవారు కోరుకుంటుంటారు.

2009లో నవంబరు 26 నుంచి నవంబరు 29 వరకు మూడు రోజుల పాటు ముంబైలో దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో మొత్తం 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. దక్షిణ ముంబైలో ఎనిమిది వేర్వురు ప్రదేశాలలో దాడులు జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీలపై ఉగ్రదాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్‌లో, విలే పార్లేలోని ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి. ఉగ్రవాద దాడుల సమయంలో ముంబై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని రామ్ ప్రధాన్ కమీషన్ నివేదికలో పేర్కొనడంతో  పలువురు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు పాలకులు.

సుల్తాన్ పూర్.. రాహుల్ నగర్‌గా మార్పు

నవంబర్‌ 26, 2008న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో యావత్‌ ప్రపంచం వణికిపోయింది అనడం అతిశయోక్తి కానే కాదు. ఈ ఘటనలో ఎంతో మంది పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అ క్రమంలోనే అమరుడైన రాహుల్ షిండే అనే కానిస్టేబుల్‌ గౌరవార్థం అతను జన్మించిన సుల్తాన్ పూర్‌కు పేరు మార్చి ఆయన పేరును పెట్టారు. ఇప్పుడు ఆ ఊరి పేరు రాహుల్ నగర్. ముంబై దాడుల నాటికి అతను మహారాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు. ఘటన సమయంలో సామాన్య ప్రజలను రక్షించేందుకు వెళ్లిన మొదటి రక్షణ బృందంలో రాహుల్ కూడా ఉన్నారు. ఉగ్రమూకలతో పోరాడే క్రమంలో ఆయన పొట్టలో ఒక బుల్లెట్‌ దిగడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం మరణాంతరం ప్రెసిడెంట్స్ పోలీస్‌ మెడల్‌ ఇచ్చి గౌరవించింది. ఇప్పుడేమో ఆయన గౌరవార్థం తన స్వగ్రామం సుల్తాన్‌పుర్‌ను రాహుల్‌ నగర్‌గా మార్చనున్నారు.

సూత్రధారులను శిక్షించే పని పూర్తి కాలేదు..

ముంబై దాడులకు కారణమైన వారిని శిక్షించడం ఇంకా పూర్తి కాలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐక్యరాజ్య సమితిలో  ఈ ఏడాది అక్టోబర్ 27న జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో తెలిపారు. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు మూడు రోజులపాటు ముంబైని దిగ్బంధనం చేశారని. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి చెందిన ‘కౌంటర్ టెర్రరిజం కమిటీ’ ప్రత్యేక సమావేశంలో శుక్రవారం విదేశాంగ మంత్రి అన్నారు.

అనేక సినిమాలు..

2022, నవంబర్ 26 నాటి దాడుల ఆధారంగా అనేక సినిమాలు తెరమీదకు  వచ్చాయి.  ముంబై దాడులను ప్రత్యక్షంగా చూసినట్లుగా ఆ చిత్రాలను రూపొందించారు పలువురు డైరెక్టర్లు. అలా వచ్చిన సినిమాలలో.. మేజర్(2022), ఫాంటమ్ (2015), ముంబై డైరీస్ 26/11 (2021), 26/11 దాడులు (2013), హోటల్ తాజ్ (2018)

మరిన్ని జాతీయ వార్తల కోసం..