AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constitution Day – PM Modi: నేడు రాజ్యాంగ దినోత్సవం.. సుప్రీంకోర్టులో జరిగే వేడుకలకు హాజరుకానున్న ప్రధాని మోడీ..

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టులో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఈ-కోర్టు ప్రాజెక్ట్ కింద వివిధ కార్యక్రమాలను సైతం ప్రారంభించనున్నారు.

Constitution Day - PM Modi: నేడు రాజ్యాంగ దినోత్సవం.. సుప్రీంకోర్టులో జరిగే వేడుకలకు హాజరుకానున్న ప్రధాని మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2022 | 8:37 AM

Share

Constitution Day – PM Modi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టులో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఈ-కోర్టు ప్రాజెక్ట్ కింద వివిధ కార్యక్రమాలను సైతం ప్రారంభించనున్నారు. నవంబర్ 26న ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో.. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించిన జ్ఞాపకార్థంగా.. 2015 నుంచి (నవంబర్ 26న) ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం 2015లో.. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ రోజును లా డేగా పాటించేవారు.

సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇ-కోర్టు ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలను సైతం ప్రారంభిస్తార‌ని సీఎంఓ తెలిపింది. ఇ-కోర్టు ప్రాజెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ కోర్టుల ద్వారా లిటిగేట్‌లు, లాయర్లు, న్యాయవ్యవస్థకు సేవలను అందించే ప్రయత్నం.. ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమాలలో ‘వర్చువల్ జస్టిస్ క్లాక్’, ‘JustIS’ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, S3WaaS వెబ్‌సైట్‌లు ఉన్నాయి. న్యాయస్థానం ద్వారా కేసుల పరిష్కార స్థితిని ప్రజలతో పంచుకోవడం ద్వారా న్యాయస్థానాల పనితీరును జవాబుదారీగా, పారదర్శకంగా చేయడమే ఈ ప్రయత్నమని కేంద్రం పేర్కొంది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కూడా ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు.

వర్చువల్ జస్టిస్ క్లాక్ అనేది న్యాయస్థాన స్థాయిలో న్యాయ బట్వాడా వ్యవస్థ, ముఖ్యమైన గణాంకాలను ప్రదర్శించడానికి ఇది ఒక చొరవ. ఇది రికార్డయిన కేసులు, పరిష్కరించిన కేసులు, కేసుల పెండింగ్‌లను కోర్టుల స్థాయిలో రోజు, వారం, నెల ప్రాతిపదికన గణాంకాలను అందిస్తుంది. కేసుల పరిష్కార స్థితిని ప్రజలతో పంచుకోవడం ద్వారా న్యాయస్థానాల పనితీరును జవాబుదారీగా, పారదర్శకంగా చేయడమే ఈ ప్రయత్నం. ప్రజలు ఏదైనా జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో వర్చువల్ జస్టిస్ క్లాక్ ను యాక్సెస్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

JustIS మొబైల్ యాప్ 2.0 అనేది న్యాయాధికారులకు (దిగువ న్యాయవ్యవస్థ సభ్యులు) సమర్థవంతమైన న్యాయస్థానం, కేసుల నిర్వహణ లాంటి వాటిని పర్యవేక్షించడానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అందుబాటులో ఉంది.

S3WaaS వెబ్‌సైట్ అనేది జిల్లా న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం, సేవలను అందిస్తారు. ఇది బహుభాషాతోపాటు దివ్యాంగులు (ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రజలు) స్నేహపూర్వకంగా ఉండనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్