Ayodhya: అయోధ్య వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా? చీఫ్ జస్టిస్ బాబ్డే అది కోరారు.. వెల్లడించిన లాయర్!

రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం చేశారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినవచ్చింది.

Ayodhya: అయోధ్య వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా? చీఫ్ జస్టిస్ బాబ్డే అది కోరారు.. వెల్లడించిన లాయర్!
Sharukh Khan
Follow us
KVD Varma

|

Updated on: Apr 23, 2021 | 11:57 PM

Ayodhya: రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం చేశారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినవచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆయన పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ఫేర్ వెల్ పార్టీలో ఈ విషయం బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ”జస్టిస్ బాబ్డే షారూఖ్ ఖాన్ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తారా అని నన్ను అడిగారు. నేను షారూఖ్ తో మాట్లాడాను. ఆయన సంతోషంగా దీనికి ఒప్పుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన మధ్యవర్తిత్వం పని చేయలేదు.” అని చెప్పారు. ఈ సమయంలో అక్కడ జస్టిస్ బాబ్డే ఉన్నారు. వికాస్ సింగ్ చెప్పేది అంతా ఆయన వింటూనే ఉన్నారు.

సుప్రీం కోర్టు తొలుత ముగ్గురు సభ్యులతో కూడిన పేనల్ ను అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి నియమించింది. అందులో జస్టిస్ కలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ లాయర్ శ్రీరాం పంచు లు ఇందులో సభ్యులు. ఈ పానెల్ చాలా సార్లు చర్చలు జరిపింది కానీ, ఫలితం దొరకలేదు. అప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ఈ కేసును సుప్రీం కోర్టు వింటుందని నిర్ణయించారు. 2019 లో సుప్రీం కోర్టు అయోధాయ్ స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చింది.

ఇక ఇదే సమావేశంలో జస్టిస్ బాబ్డే గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వికాస్ సింగ్. ఆయన్క్కు బైక్ లంటే విపరీతమైన ఇష్టం అని చెప్పారు. అందులోనూ హార్లీ డేవిడ్సన్ బైక్ చాలా ఇష్టమని తెలిపారు. ఆయన వద్ద అది ఉందని చెప్పారు. ”నేను నా హార్లీ డేవిడ్సన్ బైక్ అమ్మాలని అనుకుంటున్నానని ఆయనతో చెప్పను. దానికి జస్టిస్ బాబ్డే ఎందుకు అమ్మాలని అనుకుంటున్నావు. నాకు పంపించు అన్నారు. నేను అది చాలా బరువు ఉంటుంది మీకు ఎందుకు అని అడిగాను. దానికి ఆయన నాకు చిన్నప్పటినుంచీ బైక్లు నడపడం వచ్చు. అన్నారు. అంతే కాదు.. బైక్ ఆక్సిడెంట్ లో ఒకసారి ఆయనకు ఎముకలు విరిగాయి అంటూ వికాస్ సింగ్ జస్టిస్ బాబ్డే తొ తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Also Read: Free Essentials: ప్రపంచంలోనే శానిటరీ పాడ్ లను ఉచితంగా అందిస్తున్న సంస్థ.. వారి స్ఫూర్తిని మెచ్చుకుంటున్న దేశాధినేతలు!

Police Station: ఆ పోలీసులు అందరూ కలిసి ఒక అమ్మాయికి పసుపు రాసి గాల్లో ఎగరేసి ఆడుకుంటున్నారు..ఎందుకో.. ఏం జరిగిందో?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!