Fuel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలోనే కనిపిస్తున్న పెరుగుదల

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో

Fuel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలోనే కనిపిస్తున్న పెరుగుదల
Fuel Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2021 | 6:31 AM

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు లబోదిబోమన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలిలా. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.26 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.27 గా ఉంది. కాగా.. కరీంనగర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.21 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.72 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.25 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.14 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.64 గా ఉంది.

Also Read:

‘సైడ్ షో నాకు ఇష్టం లేదు’ అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు కేసునుంచి తప్పుకున్న సీనియర్ లాయర్ హరీష్ సాల్వే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!