రాజకీయం చేయడానికే ఆయన వచ్చారు.. గవర్నర్ సత్యపాల్

రాహుల్ గాంధీ బృందం పర్యటన కేవలం రాజకీయా చేయడానికేనంటూ మండిపడ్డారు జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని .. దీనిపై అనుమానాలుంటే చూడొచ్చంటూ స్వయంగా ఆహ్వానించానన్నారు. అయితే ఆయన ఏకంగా రాజకీయాలు మొదలు పెట్టేశారన్నారు గవర్నర్. ఆయన స్ధానికంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ బృందం జమ్ము కశ్మీర్ పర్యటనపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పరిస్థితిపై ఢిల్లీలో చెప్పిన అబద్దాలను నిజం చేసేందుకే ఆయన ఇక్కడికి వచ్చారన్నారు. […]

రాజకీయం చేయడానికే ఆయన వచ్చారు.. గవర్నర్ సత్యపాల్
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 2:50 AM

రాహుల్ గాంధీ బృందం పర్యటన కేవలం రాజకీయా చేయడానికేనంటూ మండిపడ్డారు జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని .. దీనిపై అనుమానాలుంటే చూడొచ్చంటూ స్వయంగా ఆహ్వానించానన్నారు. అయితే ఆయన ఏకంగా రాజకీయాలు మొదలు పెట్టేశారన్నారు గవర్నర్. ఆయన స్ధానికంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ బృందం జమ్ము కశ్మీర్ పర్యటనపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పరిస్థితిపై ఢిల్లీలో చెప్పిన అబద్దాలను నిజం చేసేందుకే ఆయన ఇక్కడికి వచ్చారన్నారు. జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో రాహుల్ రాక మరింత ఉద్రిక్తతలకు తావిస్తుందని అది మంచిది కాదన్నారు గవర్నర్ సత్యపాల్. ఆయన ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌కు రావాల్సిన అవసరం ఏమీ లేదని కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు.

శనివారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా సీపీఐ, సీపీఎం, డీఎంకే,టీఎంసీ పార్టీలకు చెందిన నేతలతో కూడా బృందం జమ్ములో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. అయితే వీరిని శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఢిల్లీకి పంపించిన సంగతి తెలిసిందే.