పని మాత్రమే చేయండి.. రాజకీయాలపై చర్చలొద్దు..

ఇంటర్నెట్ అంటేనే గూగుల్..అలాంటి సంస్ధ తన ఉద్యోగుల ప్రవర్తనపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. డ్యూటీ టైమ్‌లో పని మాత్రమే చేయాలని, రాజకీయాలకు తావు లేదంటూ పేర్కొంది. ముఖ్యంగా ఇంటర్నెట్ విభాగంలో రాజకీయాలపై చర్చలు పెరిగిపోతున్నాయని.. వీటిని ఇకపై ఆపేసి పనిమీద దృష్టిపెట్టాలని సూచించింది. తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ సరికొత్త ఆలోచనలతో టీమ్ స్పిరిట్‌తో సాగితే మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటామని పేర్కొంది గూగూల్. ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేయాలని, ఉద్యోగులు వాదోపవాదాలకు తావులేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా […]

పని మాత్రమే చేయండి.. రాజకీయాలపై చర్చలొద్దు..
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 2:23 AM

ఇంటర్నెట్ అంటేనే గూగుల్..అలాంటి సంస్ధ తన ఉద్యోగుల ప్రవర్తనపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. డ్యూటీ టైమ్‌లో పని మాత్రమే చేయాలని, రాజకీయాలకు తావు లేదంటూ పేర్కొంది. ముఖ్యంగా ఇంటర్నెట్ విభాగంలో రాజకీయాలపై చర్చలు పెరిగిపోతున్నాయని.. వీటిని ఇకపై ఆపేసి పనిమీద దృష్టిపెట్టాలని సూచించింది. తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ సరికొత్త ఆలోచనలతో టీమ్ స్పిరిట్‌తో సాగితే మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటామని పేర్కొంది గూగూల్.

ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేయాలని, ఉద్యోగులు వాదోపవాదాలకు తావులేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచనలకు పదును పెట్టాలని గూగుల్ పేర్కొంది. కంపెనీ నిర్ణయాలపై చర్చించడానికి అందరికీ అవకాశముందని అదే అదునుగా నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ సందేశం ద్వారా ఈ నిబంధనలు వెల్లడిచేశారు.