AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Day of Families: మొత్తం 38 మంది కుటుంబ సభ్యులు..ఒకే ఇల్లు..ఒకే వంట..భారతీయ ఉమ్మడి కుటుంబానికి సజీవ సాక్ష్యం

International Day of Families: మీకు తెలిసి.. మీరు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు?

International Day of Families: మొత్తం 38 మంది కుటుంబ సభ్యులు..ఒకే ఇల్లు..ఒకే వంట..భారతీయ ఉమ్మడి కుటుంబానికి సజీవ సాక్ష్యం
Big Family Under One Roof
KVD Varma
|

Updated on: May 15, 2021 | 6:43 PM

Share

International Day of Families: మీకు తెలిసి.. మీరు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మీ ఊరిలో ఎక్కడన్నా ఉమ్మడి కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగలరు. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా? ఈ ప్రశ్నకు చాలా ఆలోచించాల్సి వస్తుంది. అసలు మనం ఉమ్మడి కుటుంబం అనే పేరే దాదాపుగా మర్చిపోయాం. ఇక పెద్ద కుటుంబం ఎక్కడ కనిపిస్తుంది. సరే, ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి ఇంతలా విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో. అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గరలో. ఈ కుటుంబంలోని పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఈరోజు (మే 15) ప్రపంచ కుటుంబ దినోత్సవం. ఈ సందర్భంగా కలిసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు.

అది ఫిరోజాబాద్ జిల్లాలోని తుండ్లా తహసీల్ గ్రామం చికావు. అక్కడ 38 మంది సభ్యులతో ఉన్న దీక్షిత్ కుటుంబం నివసిస్తోంది. ఆ గ్రామ పెద్ద బ్రహ్మదత్త దీక్షిత్‌ను ఎన్నికల శత్రుత్వంతో కాల్చి చంపెశారు. తరువాత ఆయన నాలుగో కుమారుడు వినోద్ దీక్షిత్ ఊరి పెద్ద తొ పాటు ఇంటికి కూడా పెద్దగా నిలిచారు. తన సోదరులందరితో కలిసి, కుటుంబాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. 2,674 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిలో ఆయన, ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం 38 మంది కలిసి ఉంటున్నారు.

ఇంతమంది ఉన్న ఆ ఇంటి గడపలోకి ఇప్పటివరకూ కరోనా మహమ్మారి రాలేదట. ఆ విషయాన్ని నీరజ్ దీక్షిత్ చెబుతున్నారు. కరోనా యుగంలో, కోవిడ్ నియమాలను ఇంటి లోపల ఖచ్చితంగా పాటిస్తారనిఆయన చెప్పారు. ఇంటి లోపల, బయటి నుండి వచ్చే వారికి ప్రత్యక్ష ప్రవేశం లభించదు. బయటి గదిలో కొంత సమయం గడిపిన తర్వాత మాత్రమే ఇంటిలోకి ప్రవేశం ఉంటుంది. ఆ తరువాత కూడా వేడినీళ్ళతో స్నానం చేసి..మాస్క్ పెట్టుకుని మాత్రమే ఇంటిలో ప్రవేశించాలి. మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం పూర్తిగా మానుకున్నారు. అలాగే బయటకు పురుషులు వెళ్ళివచ్చిన తరువాత వారి మాస్క్ లు దుస్తులు వేడి నీటిలో కడుగుతారు. డిటోల్ నీటిలో కలిపి ఆ నీటిని బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగిస్తారు.

ఒక రోజులో 5 కిలోల పిండి, 3 కిలోల బియ్యం, 2 కిలోల పప్పులు మరియు 3 కిలోల దోసకాయ-టొమాటో సలాడ్ తయారు చేస్తారు. కుటుంబంలో 9 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 3 ఆహరం తయారు చేసే పనులు చూస్తారు. మరో ముగ్గురు మహిళలు ఇంటిలో ఉండే పాడిని చూసుకుంటారు, మిగిలిన ముగ్గురు మహిళలు ఇంటికి సంబంధించిన బట్టలు ఉతకడం వంటి ఇతర ఇంటి పనులను నిర్వహిస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతలు సక్రమంగా ఎవరికీ వారు చేసుకుంటారు. వారు ఉదయం మేల్కొన్న వెంటనే, ప్రతి ఒక్కరూ తమ పనిని చేసుకోవడంలోనే నిమగ్నమవుతారు. కుటుంబం పెద్దది కావడంతో ఆహారం కూడా అదే విధంగా ఉంటుందని నీరజ్ అన్నారు. ఒక రోజులో వారికి 5 కిలోల పిండి, 3 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు, 3 కిలోల సలాడ్ అవసరం అవుతాయని ఆయన చెప్పారు. నీరజ్ దీక్షిత్ వ్యవసాయం, ఊరిలో చిన్న వ్యాపారం చేస్తారు. తన పెద్ద సోదరులు ప్రమోద్ దీక్షిత్, మనోజ్ దీక్షిత్, పవన్ దీక్షిత్ ఢిల్లీలో ఉద్యగం చేస్తూ నివసించేవారు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి వారు కూడా తమ ఇంటికి వచ్చేసారు. అప్పటి నుండి అందరూ గ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయంతో పాటు, బంగాళాదుంప అమ్మకాలు, అలాగే ఇతర వ్యాపారం చేయడం ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, అందరూ కలిసే ఉంటారు. వంట ఇంటిల్లిపాదికీ కలిసి ఒకే పోయ్యిమీదే జరుగుతుందని నీరజ్ చెప్పారు. ఈ కాలంలో.. అందులోనూ కరోనా మహమ్మారితొ పరిస్థితులు గందరగోళంగా మారిన తరుణంలో అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండటం భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది.

Also Read: Coronavirus: 10 వేలకు పైగా పాముల‌ను ర‌క్షించాడు.. కోవిడ్ కాటుకు బ‌లైపోయాడు

PM Modi: ఇంటింటికీ సర్వే, టెస్టింగ్ చేయండి.. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణపై ఫోకస్.. కరోనా కట్టడి సమీక్షలో ప్రధాని మోదీ