AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరికీ అతనంటే భయం.. అందుకే కలుస్తున్నారా ?

తమిళనాట పాలిటిక్స్ ఎవరికీ అంతు చిక్కవు. ఈ వాదనకు బలం చేకూరేలా మరో పొలిటికల్ డెవలప్‌మెంట్‌కు తమిళనాడులో బీజం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య ద్విముఖ పోరుతో తమిళనాడు పాలిటిక్స్ ఆద్యంతం రక్తి కట్టించినా.. గత రెండు, మూడేళ్ళలో జరిగిన పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికలు ద్విముఖాలా ? త్రిముఖాలా ? లేక ఏకంగా […]

ఆ ఇద్దరికీ అతనంటే భయం.. అందుకే కలుస్తున్నారా ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 20, 2019 | 6:52 PM

Share

తమిళనాట పాలిటిక్స్ ఎవరికీ అంతు చిక్కవు. ఈ వాదనకు బలం చేకూరేలా మరో పొలిటికల్ డెవలప్‌మెంట్‌కు తమిళనాడులో బీజం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య ద్విముఖ పోరుతో తమిళనాడు పాలిటిక్స్ ఆద్యంతం రక్తి కట్టించినా.. గత రెండు, మూడేళ్ళలో జరిగిన పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికలు ద్విముఖాలా ? త్రిముఖాలా ? లేక ఏకంగా చతుర్ముఖాలా ? అన్న చర్చకు తాజా పరిణామాలు దారి తీస్తున్నాయి.

కరుణానిధిని కోల్పోయిన డిఎంకెకు స్టాలిన్ రూపంలో బలమైన నాయకుడున్నారు. జయలలితను కోల్పోయిన అన్నా డిఎంకెకు ప్రజల్లో చరిష్మా వున్న నేత కరువయ్యారనే చెప్పాలి. జయలలిత బతికున్నప్పుడే సీఎం అయిన పన్నీర్ సెల్వం కానీ, పురుచ్చితలైవి మరణం తర్వాత నాటకీయ పరిణామాల మద్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి కానీ.. అధికారంలో వున్నా కూడా పెద్దగా చరిష్మా సంపాదించు కోలేకపోయారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు తమిళనాడులో. వీరిలో తొలి వ్యక్తి సినీ నటుడు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. ఈలోగా కమిటైన సినిమాలను పూర్తి చేస్తూనే పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కమల్ హాసన్.

ఇక భారతీయ సినీ చరిత్రపై తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న తలైవా రజనీకాంత్ కూడా రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు దాదాపు రెండేళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే.. అప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో పార్టీ పేరు, ఇతరత్రా కార్యక్రమాలేవీ పూర్తి చేయకుండా చక్కగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు రజనీకాంత్. అయితే.. 2021 మే నెలకు ముందే ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో 2020 సెప్టెంబర్ నుంచి రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఈలోగా రజనీ ఫ్యాన్ క్లబ్స్‌ని పార్టీ కార్యవర్గాలుగా మార్చే పనిని తన ఫ్యాన్స్‌కు పురమాయించారు రజనీకాంత్. వచ్చే సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేలా యాక్షన్ ప్లాన్‌ని సిద్దం చేసుకున్నారాయన.

ఇదంతా బాగానే వున్నా తాజాగా రజనీకాంత్, కమల్ హాసన్ కలసి పని చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి పార్టీలు కలిసి ఎన్నికల బరిలో నిలిస్తే.. అధికార అన్నాడిఎంకెతోపాటు విపక్ష డిఎంకెను ఎదుర్కొని విజయం సాధించ వచ్చన్నది వీరిద్దరి వ్యూహంగా చెబుతున్నారు. అయితే.. ఇందులో మరో వ్యూహం కూడా వుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల తమిళనాడులో సర్వే నిర్వహించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తన సర్వే రిపోర్టుతో తమిళ హీరో విజయ్‌ని కల్వడం, ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని పిలవడం జరిగింది. ఎందుకంటే తాను నిర్వహించిన సర్వేలో తదుపరి సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు 28 శాతం మంది తమిళులు విజయ్ పేరుకు ఓటేశారట. ఈ వివరాలన్నీ విజయ్‌కు వివరించిన ప్రశాంత్ కిశోర్‌ ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే సరైన సమయమని సలహా ఇచ్చారట. ఒకవేళ విజయ్ కూడా రాజకీయరంగ ప్రవేశం చేస్తే.. ఆయన్ని నిలువరించేందుకు ఏ ఒక్కరి స్టార్ డమ్ సరిపోదని భావిస్తున్న రజనీ, కమల్.. తామిద్దరం కలిసి పని చేయడమే దానికి సరైన మార్గమన్న అభిప్రాయానికి వచ్చినట్లు పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

ఆల్ రెడీ రాజకీయాల్లో ఉద్దండ పిండాలైన డిఎంకె. అన్నా డిఎంకెలను ఎదుర్కోవడంతోపాటు ఒకవేళ విజయ్ రూపంలో ఎదురయ్యే కొత్త సవాల్‌ను అధిగమించాలంటే తామిద్దరం కలిసి పని చేయడమే కరెక్టని ఇద్దరు హీరోలు ఏకాభిప్రాయానికి వచ్చారని తమిళ మీడియా కథనాలు రాస్తోంది. ఇదే జరిగితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రక్తికట్టడం ఖాయం.