బ్రేకింగ్: దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ.. తేల్చిచెప్పిన అమిత్‌ షా..!

దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో.. కశ్మీర్‌ పరిస్థితిపై సమాధానం చెబుతూ… జాతీయ పౌర జాబితా అంశాన్ని కూడా ప్రస్తావించారు. అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ తరహాలోనే.. అన్ని రాష్ట్రాల్లోనూ.. దీన్ని చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. వివిధ మతాలకు చెందినవారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పౌరుల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఎన్ఆర్‌సీ ప్రకియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో […]

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ.. తేల్చిచెప్పిన అమిత్‌ షా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 20, 2019 | 9:18 PM

దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో.. కశ్మీర్‌ పరిస్థితిపై సమాధానం చెబుతూ… జాతీయ పౌర జాబితా అంశాన్ని కూడా ప్రస్తావించారు. అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ తరహాలోనే.. అన్ని రాష్ట్రాల్లోనూ.. దీన్ని చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. వివిధ మతాలకు చెందినవారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పౌరుల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఎన్ఆర్‌సీ ప్రకియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా.. సుప్రీం పర్యవేక్షణలోనే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ నడుస్తోందని, ఈ ప్రక్రియ.. ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం కానీ, తొలగించడం కానీ ఉండదన్నారు. అన్ని మతాల ప్రజలకు ప్రభుత్వం ‘ఆశ్రయం’ కల్పిస్తుందని అమిత్‌ షా ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో వివక్షకు గురైన ఈ శరణార్థులందరికీ భారత పౌరసత్వం లభిస్తుందని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ చేపట్టినంత మాత్రాన ఏ మతానికి చెందినవారయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఇది కేవలం ప్రక్రియ మాత్రమే.. పౌరుల జాబితాలో ప్రతి వ్యక్తి పేరూ ఉండాలన్నదే దీని ఉద్దేశం ; అని ఆయన చెప్పారు. అస్సాంలో మళ్ళీ ఎన్నార్సీ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో ఆ మధ్య ఈ ప్రక్రియ చేబట్టినప్పుడు సుమారు 19 లక్షలమంది పేర్లను తొలగించారు. వారిలో చాలామంది తాము భారతీయులమేనని నిరూపించుకోలేకపోయారని, తగిన డాక్యుమెంట్లను సమర్పించలేకపోయారని ప్రభుత్వం పేర్కొంది. అయితే వారిని ‘ ఇల్లీగల్ ‘ గా సర్కార్ ఇప్పుడే ప్రకటించబోవడంలేదు. వారు విదేశీ ట్రిబ్యునల్స్ ని లేదా కోర్టులను ఆశ్రయించవచ్చు. ఎన్నార్సీలో తమ పేర్లు కనిపించనివారు ట్రిబ్యునల్స్ లో పిటిషన్లు దాఖలు చేయవచ్ఛునని అమిత్ షా తెలిపారు. అస్సాంలో ఇందుకు వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుందన్నారు. కాగా-గతంలో కూడా అమిత్ షా ఎన్నార్సీ విషయాన్ని ప్రస్తావించారు. అయితే పార్లమెంటులో దీనిపై ఆయన ప్రకటన చేయడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఈ సంచలనమైన ప్రకటన కూడా చేరిపోయింది.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..