చిరుత-పైథాన్‌ల భయంకర యుద్ధం చూశారా..? చివరికి..!

సాధారణంగానే.. ఫారెస్ట్ రిజర్వుల్లో జంతువులు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాయి. టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు వాటిని మనం కళ్లారా చూస్తున్నాం. అయితే.. అలాంటి ఓ యుద్ధమే అడవిలో జరిగింది. అది అలాంటి.. ఇలాంటి యుద్ధం కాదు లెండి. అదేంటో తెలుసుకోవాలని బాగా ఆసక్తిగా ఉందా..! ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి. ‘కెన్యాలోని మసాయి మరా ట్రయాంగిల్’ రిజర్వులో చిరుత, పైథాన్ ఒకదానిపై మరొకటి తమ సత్తా చూపించేందుకు ప్రయత్నించాయి. ముందు.. పైథాన్.. చిరుతతో.. కయ్యానికి కాలుదువ్వింది. దీంతో.. ఇక […]

చిరుత-పైథాన్‌ల భయంకర యుద్ధం చూశారా..? చివరికి..!
Follow us

| Edited By:

Updated on: Nov 20, 2019 | 5:05 PM

సాధారణంగానే.. ఫారెస్ట్ రిజర్వుల్లో జంతువులు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాయి. టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు వాటిని మనం కళ్లారా చూస్తున్నాం. అయితే.. అలాంటి ఓ యుద్ధమే అడవిలో జరిగింది. అది అలాంటి.. ఇలాంటి యుద్ధం కాదు లెండి. అదేంటో తెలుసుకోవాలని బాగా ఆసక్తిగా ఉందా..! ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి.

‘కెన్యాలోని మసాయి మరా ట్రయాంగిల్’ రిజర్వులో చిరుత, పైథాన్ ఒకదానిపై మరొకటి తమ సత్తా చూపించేందుకు ప్రయత్నించాయి. ముందు.. పైథాన్.. చిరుతతో.. కయ్యానికి కాలుదువ్వింది. దీంతో.. ఇక చిరుత.. తన ప్రతాపాన్ని చూపించింది. ఈ రెండింటి మధ్య జరిగిన ఈ పోరులో చిరుతనే గెలిచింది. చిరుత, కొండచిలువ ఒకదానికొకటి చాలా సేపు పోరాడాయి. చిరుత చివరగా పైథాన్ తలపై కొరకడంతో.. అది గాయాలపాలై మరణించింది. పైతాన్, చిరుత ఫైటింగ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైక్ విల్టన్ అనే పర్యాటకుడు ఈ వీడియోను తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇక మరి.. ఈ రెండింటి యుద్ధాన్ని మీరూ చూసేయండి.