AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: ఏంటమ్మ ఇలా చేశావ్.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని ఏం చేసిందో తెలుసా?

తమిళనాడులో గురువారం (8వ తేదీ) ఇంటర్‌ రిజల్ట్‌ రిలీజ్ కానున్న తరుణంలో పరీక్ష ఫలితాలపై ఆందోళనకు గురైన ఓ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో చోటుచేసుకుంది. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu: ఏంటమ్మ ఇలా చేశావ్.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని ఏం చేసిందో తెలుసా?
Tamilnadu Student
Anand T
|

Updated on: May 08, 2025 | 9:06 AM

Share

పరీక్షా ఫలితాలపై ఆందోళనకు గురైన ఇంటర్ సెకండర్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లా పాపనాశంకు చెందిన ఆర్తిక అనే విద్యార్థిని.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్‌ సెకండియర్ చదువుతోంది. తాజాగా ఆమె 12వ తరగతి పరీక్షలను పూర్తి చేసింది. ఇక గురువారం( 8వ తేదీన) 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని ఆర్తిక కొన్ని రోజులుగా భయపడుతున్నట్టు తెలుస్తోంది. తన స్నేహితులతో కూడా రిజల్ట్‌ గురించి ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే మంగళవారం నుంచి ఆర్తిక కనిపించకుండా పోయింది.

ఇక ఇంట్లో కూతురు కనిపించకపోయే సరికి టెన్షన్ పడిన తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టు పక్కల ప్రాంతాలను మొత్తం వెతికారు.. ఈ క్రమంలో ఇంటి వెనక ఉన్న గోశాలలోకి వెళ్లి చూశారు. అయితే ఆ గోశాలలో ఆర్తిక ఉరివేసుకొని వెలాడుతూ కనిపించింది. అక్కడ కూతురుని చూసి ఒక్కసారిగా షాక్ అయిన తల్లిదండ్రులు ఆమెను కిందకు దించారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో చేతికొచ్చిన కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే కొన్నాళ్లుగా పరీక్ష ఫలితాలపై ఆందోళన వ్యక్తి చేసిన ఆర్తిక.. గురువారం రిజల్ట్‌ రానున్న నేపథ్యంలో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆర్తిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్సిటల్‌కు తరలించారు. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆర్తిక ఫెయిల్‌ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..