INS Mormugao: ఇండియన్ నేవీలో మరో అద్భుత ఘట్టం.. ఐఎన్ఎస్ మోర్ముగావ్ జల ప్రవేశం నేడే..
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో నౌకాస్త్రం వచ్చి చేరనుంది. దేశీయంగా నిర్మించిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ ఇవాళ జలప్రవేశం చేయనుంది. దేశీయంగా..
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో నౌకాస్త్రం వచ్చి చేరనుంది. దేశీయంగా నిర్మించిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ ఇవాళ జలప్రవేశం చేయనుంది. దేశీయంగా నిర్మించిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ నేవీలో చేరనుంది. ఇవాళ గోవా విమోచనా దినోత్సవం సందర్భంగా ముంబయిలోని నావల్ డాక్ యార్డులో నిర్వహించే కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఐఎన్ఎస్ నౌకను నేవీకి అప్పగించనున్నారు. 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ యుద్ధ నౌకలో అత్యాధునిక సెన్సర్లు, రాడార్ వ్యవస్థలను అమర్చారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైన, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ దీనిలో ఉంది.
ఇది పీ15 బ్రేవర్ క్లాసుకు చెందినది. ఈ నౌకలో అన్ని రకాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎటువంటి సమయంలోనైనా దీన్ని ఆపరేట్ చేసేలా తయారు చేశారు. యాంటీ ఎయిర్, యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు ఈ షిప్‌లో ఉన్నాయి. మిస్సైల్ వ్యవస్థ కూడా ఉంది. హిందూ మహా సముద్రంలో రక్షణ, నౌకాదళ సత్తాను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐఎన్ఎస్ మర్ముగోవా.. సెకండ్ జనరేషన్‌కు చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్. ప్రాజెక్టు 15బీ కింద దీన్ని తయారు చేశారు.
గోవాలోని మర్ముగోవా సిటీ పేరును దీనికి పెట్టారు. భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేసింది. మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని నిర్మించారు. విశాఖపట్నం, మర్మగోవా, ఇంపాల్, సూరత్ నగరాల పేరు మీద నాలుగు విధ్వంసక యుద్ధ నౌకలను తయారు చేస్త్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.