మోదీ జీఎస్టీ భారం.. ‘పార్లే జీ’ ఉద్యోగులకు శాపం.?

దేశ ఆర్ధిక రంగంలో సంక్షోభం ఏర్పడింది. జీడీపీ పడిపోతోంది..మార్చిలో 5.8శాతంగా ఉంటే.. జూన్ త్రైమాసికం 5.4శాతానికి దిగజారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మోదీ తెచ్చిన జీఎస్టీ భారం బిస్కెట్ల పరిశ్రమలకు కుదిబండలా మారింది. ఈ ప్రభావం వల్ల ఉద్యోగాలు ఊడిపోయి కంపెనీలు మూతపడే స్థాయికి దిగజారింది. దేశంలో అతి పెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ పార్లే – జీ.. కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక రంగంలో మందగమనం.. కేంద్రం విధించిన 18శాతం జీఎస్టీ […]

మోదీ జీఎస్టీ భారం.. 'పార్లే జీ' ఉద్యోగులకు శాపం.?
Follow us

|

Updated on: Aug 21, 2019 | 6:57 PM

దేశ ఆర్ధిక రంగంలో సంక్షోభం ఏర్పడింది. జీడీపీ పడిపోతోంది..మార్చిలో 5.8శాతంగా ఉంటే.. జూన్ త్రైమాసికం 5.4శాతానికి దిగజారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మోదీ తెచ్చిన జీఎస్టీ భారం బిస్కెట్ల పరిశ్రమలకు కుదిబండలా మారింది.

ఈ ప్రభావం వల్ల ఉద్యోగాలు ఊడిపోయి కంపెనీలు మూతపడే స్థాయికి దిగజారింది. దేశంలో అతి పెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ పార్లే – జీ.. కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక రంగంలో మందగమనం.. కేంద్రం విధించిన 18శాతం జీఎస్టీ తలకుమించిన భారమవడంతో.. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలిగించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. పార్లే బిస్కెట్ అమ్మకాలు స్వల్పంగా పడిపోవడంతో కంపెనీ ఉత్పత్తిని కూడా తగ్గించనుందని సమాచారం.

‘పార్లే’ కంపెనీ ఎండీ మయాంక్ షా దీనిపై ప్రస్తావిస్తూ.. కేంద్రం విధించిన 18 శాతం జీఎస్టీ భారంగా మారిందని.. దీని వల్ల రెండు ఆప్షన్స్ మాత్రమే కనబడుతున్నాయని అన్నారు. మోదీ, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుని జీఎస్టీని తగ్గించాలి.? లేదా ఉద్యోగాల కోత విధించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.  బిస్కెట్లకు డిమాండ్ బాగా పడిపోయిందని.. అధిక జీఎస్టీ పరిశ్రమను భారీగా దెబ్బతీసిందని షా తెలిపారు.