లైవ్ అప్ డేట్స్: అజ్ఞాతం వీడిన చిదంబరం.. నెక్స్ట్ ఏంటి.?

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం తాజాగా ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలను కలిశారు. అనంతరం ఆయన మీడియా ముందుకొచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తనకు ఆ అవసరం లేదని ఆయన ప్రకటించారు. ఐఎన్‌ఎక్స్ కేసుకు సంబంధించి తాను లాయర్లతో మాట్లాడానని తెలిపారు. తాను ఎలాంటి నేరం చేయలేదని.. ఈ కేసులో కావాలనే కొందరు తనను ఇరికించారని చెప్పారు. అంతేకాదు తాను నిందితుడిని కాదని.. ఛార్జిషీటులో తన పేరు కూడా లేదన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:30 pm, Wed, 21 August 19
లైవ్ అప్ డేట్స్: అజ్ఞాతం వీడిన చిదంబరం.. నెక్స్ట్ ఏంటి.?

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం తాజాగా ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలను కలిశారు. అనంతరం ఆయన మీడియా ముందుకొచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తనకు ఆ అవసరం లేదని ఆయన ప్రకటించారు. ఐఎన్‌ఎక్స్ కేసుకు సంబంధించి తాను లాయర్లతో మాట్లాడానని తెలిపారు. తాను ఎలాంటి నేరం చేయలేదని.. ఈ కేసులో కావాలనే కొందరు తనను ఇరికించారని చెప్పారు. అంతేకాదు తాను నిందితుడిని కాదని.. ఛార్జిషీటులో తన పేరు కూడా లేదన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని చిదంబరం చెప్పారు. దీంతో కాసేపు ఏఐసీసీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. అప్పటికే అతడు ఇంటికి వెళిపోవడంతో.. సీబీఐ అధికారులు చిదంబరం ఇంటి వద్దకు చేరుకున్నారు.