భారత తొలి మహిళా డీజీపీ ఇకలేరు
భారతదేశపు తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంచన్ చౌదరి.. అమృత్‌సర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. అలాగే 1993లో ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. ఇక 1973 సివిల్స్‌కు […]
భారతదేశపు తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంచన్ చౌదరి.. అమృత్‌సర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. అలాగే 1993లో ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. ఇక 1973 సివిల్స్‌కు ఎన్నికైన భట్టాచార్య.. దేశంలో ఐపీఎస్ సాధించిన రెండో మహిళ రికార్డులకెక్కారు. ఇక 2004లో ఉత్తరాఖండ్ తొలి మహిళా డీజీపీగా పనిచేసిన ఆమె.. 2007 అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. ఆ తరువాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు. మరోవైపు భట్టాచార్య మృతిపట్ల ప్రముఖులు, ఐపీఎస్ అధికారులు నివాళులర్పించారు.