India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన ఏరీస్ డెక్ క్యాడెట్.. మరో 16 మంది కోసం..

ఇరాన్, ఇజ్రాయెల్.. మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తో సంబంధాలున్నాయన్న కారణంతో కార్గో షిప్ MSC ఏరీస్ ను స్వాధీనం చేసుకుంది. సముద్ర చట్టాలను ఉల్లంఘించారన్న కారణంతో ఏప్రిల్ 13న ఇరాన్ పోర్చుగీస్ జెండాతో కూడిన ఇజ్రాయెల్ కార్గో షిప్ MSC ఏరీస్ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన ఏరీస్ డెక్ క్యాడెట్.. మరో 16 మంది కోసం..
Indian deck cadet Ms Ann Tessa Joseph
Follow us

|

Updated on: Apr 18, 2024 | 7:50 PM

ఇరాన్, ఇజ్రాయెల్.. మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తో సంబంధాలున్నాయన్న కారణంతో కార్గో షిప్ MSC ఏరీస్ ను స్వాధీనం చేసుకుంది. సముద్ర చట్టాలను ఉల్లంఘించారన్న కారణంతో ఏప్రిల్ 13న ఇరాన్ పోర్చుగీస్ జెండాతో కూడిన ఇజ్రాయెల్ కార్గో షిప్ MSC ఏరీస్ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నౌక ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉందనడంలో సందేహం లేదని పేర్కొంది. ఈ భారీ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు.. దీంతో భారత్ రంగంలోకి దిగింది. ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న MSC ఏరీస్ అనే కంటైనర్ నౌకలో 17 మంది భారతీయులలో ఉన్న ఆన్ టెస్సా జోసెఫ్ అనే మహిళా క్యాడెట్ గురువారం కొచ్చిన్‌కు తిరిగి వచ్చారు. టెహ్రాన్‌లోని భారత అధికారులు కంటైనర్ ఓడలోని మిగిలిన 16 మంది భారతీయ సిబ్బందితో టచ్‌లో ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.

కేరళలోని త్రిసూర్‌కు చెందిన భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ ఈ రోజు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగారంటూ భారతీయ దౌత్యవేత్త, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు.

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్, MSC ఏరీస్ నౌకలోని సిబ్బందిలో సభ్యురాలు.. ఈరోజు ఇంటికి తిరిగి వచ్చారు. భారత్.. ఇరాన్ అధికారుల మద్దతుతో, ఆమె తిరిగి రావడానికి దోహదపడింది. మిగిలిన 16 మంది సిబ్బంది కోసం భారత్ ఇరాన్ తో టచ్‌లో ఉంది. అంటూ విమానాశ్రయంలో జోసెఫ్‌కు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్వాగతం పలుకుతున్న ఫొటోను రణధీర్ జైస్వాల్ పంచుకున్నారు.

సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని, భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఇరాన్ కౌంటర్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో నాలుగు రోజుల క్రితం ఈ విషయంపై మాట్లాడారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రత్యేక నౌకాదళం ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యా “MSC ఏరిస్”ను స్వాధీనం చేసుకుంది. దీనిలో మొత్తం 25 మంది ఉండగా.. 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles