Indian Railways: ఉసురు కోల్పోతున్న జనాళికి ఊపిరి పోస్తూ రికార్డు పరుగులు తీస్తున్న మన రైలు బళ్ళు..

Indian Railways: ప్రాణవాయువు కొరతతో ఒడిగడుతున్న జనాళికి.. దేశవ్యాప్తంగా వేగవంతమైన పరుగులతో కొత్త ఊపిరి పోశాయి భారత రైల్వేలు. రికార్డు స్థాయిలో ఆక్సిజన్ ను దేశంలోని నలుమూలలకూ అందించి కష్టకాలంలో అత్యవసర పరుగులు తీస్తున్నాయి.

Indian Railways: ఉసురు కోల్పోతున్న జనాళికి ఊపిరి పోస్తూ రికార్డు పరుగులు తీస్తున్న మన రైలు బళ్ళు..
Indian Railways
Follow us

|

Updated on: May 24, 2021 | 10:24 PM

Indian Railways: ప్రాణవాయువు కొరతతో ఒడిగడుతున్న జనాళికి.. దేశవ్యాప్తంగా వేగవంతమైన పరుగులతో కొత్త ఊపిరి పోశాయి భారత రైల్వేలు. రికార్డు స్థాయిలో ఆక్సిజన్ ను దేశంలోని నలుమూలలకూ అందించి కష్టకాలంలో క్లిష్టమైన పనిని రికార్డు వేగంతో సాధించాయి మన రైలు బళ్ళు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేలు ఒక్క నెలలో 16 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా పూర్తి చేశాయి. “అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే రైల్వే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విఫైడ్ ఆక్సిజన్ ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు, రైల్వేలు 977 ట్యాంకర్లలో 16,023 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశాయి. ”అని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

247 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయని చెప్పాలి. ఈ ప్రకటన విడుదల సమయంలో.. 50 లోడు ట్యాంకులలో 12 లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 920 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో తమ తమ గమ్యాల వైపు పరుగులు తీస్తున్నాయి. మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం, “నిన్న(మే 23) ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు అత్యధికంగా 1,142 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిణీ చేశాయి. అంతకుముందు 2021 మే 20 న 1,118 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఈ రైళ్ళద్వారా తమ గమ్యాలకు చేరుకుంది.”

తమిళనాడుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఎల్‌ఎంఓ పంపిణీ 1,000 మెట్రిక్ టన్నులు దాటింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ డెలివరీలను 30 రోజుల క్రితం ఏప్రిల్ 24 న మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల లోడుతో ప్రారంభించాయి. ఒక నెలలోనే రైల్వే దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు 16,000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓలను పంపిణీ చేసింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆక్సిజన్ రవాణా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి 14 రాష్ట్రాలకు చేరుకుంది.

ఈ ప్రకటన విడుదల సమయానికి మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 3649 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌లో 633 మెట్రిక్ టన్నులు, ఢిల్లీలో 4600 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 1759 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌లో 98 మెట్రిక్ టన్నులు, 1063 మెట్రిక్ టన్నులు అన్ లోడ్ చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలో, ఉత్తరాఖండ్‌లో 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 1024 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 730 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌లో 225 మెట్రిక్ టన్నులు, కేరళలో 246 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 976 మెట్రిక్ టన్నులు, అస్సాంలో 80 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఈ ఎక్స్ ప్రెస్ రైళ్ళతో అందుబాటులోకి వచ్చింది.

Also Read: Antibody Cocktail: కరోనా కోసం కొత్త మందు..యాంటీ బాడీ కాక్‌టెయిల్‌..దీంతో ఇమ్యునైజేషన్ పెరుగుతుందట..ఖరీదు ఎంతంటే..

Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..