Inspiration: అమ్మమ్మ కోరిందని, రూ.12కోట్ల కారును కొనుగోలు చేసిన మనవడు..!

మనవడు తన అమ్మమ్మ మాట విని మెక్‌లారెన్ 765LT కొన్నాడు. వీడియోలో, కుటుంబం, స్నేహితులు ఈ విలాసవంతమైన సూపర్‌కార్‌ను డెలివరీ చేస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

Inspiration: అమ్మమ్మ కోరిందని, రూ.12కోట్ల కారును కొనుగోలు చేసిన మనవడు..!
Mclaren Car
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 17, 2024 | 9:14 AM

ఒక పవర్‌ఫుల్‌ స్పోర్ట్స్ కారు మీ ముందు వెళుతుంటే ఊహించండి. ఆ కారును జాగ్రత్తగా పరిశీలిస్తే.. అది ఓ యువకుడు కాదు.. చీర కట్టుకుని నుదుటిపై చందనం తిలకం పెట్టుకున్న 80 ఏళ్ల వృద్ధురాలు నడుపుతోంది. ఈ దృశ్యాన్ని చూసి షాక్ అవ్వాల్సిందే..! కన్ఫర్మేషన్ కోసం డ్రైవర్ సీటు వైపు మళ్లీ చూస్తే, పెద్దావిడా దర్జాగా కారు నడుపుకుంటూ వెళ్తోంది.

మనవడితో కలిసి కార్ల గురించి మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిలో ఒకరు తన మనవడి ముందు మెక్‌లారెన్ 765LT కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. మనవడు దానిని నిజం చేశాడు. మెక్‌లారెన్ 765LT రూ. 12 కోట్ల కంటే ఎక్కువ విలువైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసి అమ్మమ్మకు ఇచ్చాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇంటర్నెట్‌లో మిలియన్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. సూపర్ కార్ల పట్ల ఈ కుటుంబానికి ఉన్న ప్రేమ ఇంతకు ముందు వార్తల్లో నిలిచింది. అమ్మమ్మలు గతంలో లాంబోర్ఘిని హురాకాన్, ఉరుస్‌లను నడిపేవారు.

మనవడు తన అమ్మమ్మ మాట విని మెక్‌లారెన్ 765LT కొన్నాడు. వీడియోలో, కుటుంబం, స్నేహితులు ఈ విలాసవంతమైన సూపర్‌కార్‌ను డెలివరీ చేస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఆనంద్ స్వయంగా తన మనవళ్ల వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మెక్‌లారెన్ ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు భారతదేశంలో ఈ కారు కేవలం ముగ్గురికి మాత్రమే ఉంది. భారతదేశంలో ఈ సూపర్‌కార్ ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వాహనం దుబాయ్‌లో రిజిస్టర్ చేయడం జరిగింది. దుబాయ్‌లో దీని ధర కొంచెం తక్కువగా ఉండవచ్చు. డెలివరీ సమయంలో, కేరళలో ఈ కారును కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి, భారతదేశంలో మెక్‌లారెన్ 765LT మూడవ యజమాని తానే అని డీలర్‌ ఆనంద్‌కు చెప్పారు.

మెక్‌లారెన్ 765LT పరిమిత ఎడిషన్ కారు. ఇందులో 765 యూనిట్లు మాత్రమే తయారు అయ్యాయి. ఈ వాహనంలో 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 పెట్రోల్ ఇంజన్ ఉంది. 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ కారు కేవలం 2.8 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. కారు డిజైన్ దాని అతిపెద్ద ఫీచర్. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన బాడీ. ఏరోడైనమిక్ డిజైన్ దీనికి చాలా ప్రత్యేకమైనవి. స్పైడర్ వెర్షన్ ఫోల్డబుల్ రూఫ్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే