AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందిః అశ్విని వైష్ణవ్

వచ్చే 10 ఏళ్లలో భారత్‌ సాక్ష్యమివ్వనున్న అద్భుతమైన వృద్ధికి అనుగుణంగా వ్యాపార, వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌. ముంబయిలో జరిగిన 'EY ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023' కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ, రైసినా డైలాగ్ 2024లో భారతదేశంలో వ్యాపారం చేయవలసిందిగా గ్లోబల్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

Ashwini Vaishnaw: వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందిః అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Balaraju Goud
|

Updated on: Feb 24, 2024 | 7:35 PM

Share

ఆర్థిక మాంద్యం సమయంలో సైతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పునర్ఘాటించారు. పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు. బ్రిటన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలదీ అదే పరిస్థితి. అక్కడ కూడా వృద్ధి రేటు నత్త నడకన సాగుతోంది. వచ్చే పదేళ్లలో భారత్ ఆరు నుంచి ఎనిమిది శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందిన దేశంగా అవరించబోతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

వచ్చే 10 ఏళ్లలో భారత్‌ సాక్ష్యమివ్వనున్న అద్భుతమైన వృద్ధికి అనుగుణంగా వ్యాపార, వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌. ముంబయిలో జరిగిన ‘EY ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023’ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ, రైసినా డైలాగ్ 2024లో భారతదేశంలో వ్యాపారం చేయవలసిందిగా గ్లోబల్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుండి లబ్ది పొందేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ప్రపంచానికి బహిరంగ మార్కెట్‌గా అభివర్ణించిన ఆయన ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగంగా సాగుతుందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల భారత దేశం వేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి పునాది వేయడం జరిగిందన్నారు. రాబోయే ఐదేళ్లలో విద్య, ఆరోగ్యం, సేవ, తయారీ, సాంకేతిక రంగాల అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర మంత్రి అశ్విని అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరిగాయన్నారు. గత 9 ఏళ్లలో ఇది 615.73 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించారు. భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా వేగంగా పెరిగాయన్నారు. ప్రస్తుతం 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. మొత్తంమీద భారతదేశం గ్లోబల్ ఇంజిన్‌కు హబ్‌గా మారే రోజు దగ్గరలోనే ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా భారత్‌పై అంతర్జాతీయ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వృద్ధి అంచనా 7 శాతంగా ఉందన్నారు. కానీ వాస్తవానికి, NSO (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) ప్రస్తుత సంవత్సరానికి 7.3% చేరుకుందని, అదీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7.3%గా ఉంటుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…