Chatbot Hanuman: దేశంలో త్వరలో రిలయన్స్‌ నుంచి ‘హనుమాన్’.. చాట్ జీపీటీకి పోటీ.!

Chatbot Hanuman: దేశంలో త్వరలో రిలయన్స్‌ నుంచి ‘హనుమాన్’.. చాట్ జీపీటీకి పోటీ.!

Anil kumar poka

|

Updated on: Feb 24, 2024 | 6:54 PM

దేశీయ కృత్రిమ మేధ AI రంగంలో అతిపెద్ద అడుగు పడనుంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ - 8 యూనివర్సిటీలు కలిసి ‘భారత్‌జీపీటీ’ పేరిట కన్సార్షియంగా ఏర్పడ్డాయి. చాట్‌జీపీటీ తరహా సేవలను ‘హనుమాన్‌’ పేరుతో అందించేలా ప్లాన్ చేశారు. వచ్చే నెలలో ఈ కన్షార్షియం ఆవిష్కరణ ఉంటుందని తెలుస్తోంది. ముంబయిలో జరిగిన ఒక టెక్‌ సదస్సులో హనుమాన్ సారాంశాన్ని కన్సార్షియం ప్రదర్శించింది.

దేశీయ కృత్రిమ మేధ AI రంగంలో అతిపెద్ద అడుగు పడనుంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ – 8 యూనివర్సిటీలు కలిసి ‘భారత్‌జీపీటీ’ పేరిట కన్సార్షియంగా ఏర్పడ్డాయి. చాట్‌జీపీటీ తరహా సేవలను ‘హనుమాన్‌’ పేరుతో అందించేలా ప్లాన్ చేశారు. వచ్చే నెలలో ఈ కన్షార్షియం ఆవిష్కరణ ఉంటుందని తెలుస్తోంది. ముంబయిలో జరిగిన ఒక టెక్‌ సదస్సులో హనుమాన్ సారాంశాన్ని కన్సార్షియం ప్రదర్శించింది. తమిళనాడులోని ఒక మోటార్‌ మెకానిక్‌, ఏఐ బాట్‌లో తన సందేహాలను తీర్చుకోవడం; ఒక బ్యాంకర్‌ హిందీ టూల్‌ను వాడుకోవడం; హైదరాబాద్‌కు చెందిన ఒక డెవలపర్‌ కంప్యూటర్‌ కోడ్‌ను రాయడానికి దీనిని ఉపయోగించుకోవడం వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ‘హనుమాన్‌’ మోడల్‌ విజయవంతమైతే 11 భాషల్లో నాలుగు ప్రధాన రంగాలైన ఆరోగ్య రంగం, పాలన, ఆర్థిక సేవలు, విద్యలో ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. ఐఐటీల భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడల్‌కు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచాయి. ఓపెన్‌ ఏఐ వంటి కంపెనీలు అందించే భారీ స్థాయి సేవలు కాకుండా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉండే సరళతర మోడళ్లు ‘హనుమాన్‌’లో ఉంటాయి. దేశంలోనే తొలి ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంలో రానున్న ‘హనుమాన్‌’ ద్వారా మాటలను అక్షరాల్లోకి మార్చే సదుపాయం.. అంటే స్పీచ్ టూ టెక్స్ ఫెసిలిటీ ఉంటుంది. 140 కోట్ల మంది భారతీయుల్లో లక్షల మందికి చదవడం, రాయడం రాదన్న విషయాన్ని గుర్తుంచుకుని.. ఈ తరహా నిర్దిష్ట అవసరాలకు తగ్గట్లుగా పలు కస్టమైజ్డ్‌ మోడళ్లను ఇది తీసుకురానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..