Voice Cloning: మీ గొంతును కాపీ కొట్టి మోసం చేసే వాయిస్ క్లోనింగ్ స్కామ్ గురించి తెలుసా?
డబ్బులు ఇస్తేనే మీ పిల్లలను విడిచిపెడతామని బెదిరిస్తారు. మీరు మోసపోతున్నట్లుగా వారికి అనిపించగానే.. మీ పిల్లలు ఏడుస్తున్న వాయిస్ ను వినిపిస్తారు. దీంతో మీ బిడ్డ నిజంగానే ఇబ్బందుల్లో ఉన్నారని మీరు అనుకుంటారు. అటువంటి పరిస్థితులలో, మీరు భయాందోళనలకు గురవుతారు. స్కామర్‌లకు డబ్బు పంపిస్తారు. తర్వాత, మీ చిన్నారి ఫోన్‌లో లో మాట్లాడలేదని తెలుస్తుంది..
ఇటీవలి కాలంలో, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇలాంటి మోసానికి సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. వీటిని వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లు అంటారు. చాలా సందర్భాలలో, వారి కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారి పిల్లల గొంతులను అనుకరిస్తారు సైబర్ మోసగాళ్లు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పిల్లలను క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తారు. అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు.
డబ్బులు ఇస్తేనే మీ పిల్లలను విడిచిపెడతామని బెదిరిస్తారు. మీరు మోసపోతున్నట్లుగా వారికి అనిపించగానే.. మీ పిల్లలు ఏడుస్తున్న వాయిస్ ను వినిపిస్తారు. దీంతో మీ బిడ్డ నిజంగానే ఇబ్బందుల్లో ఉన్నారని మీరు అనుకుంటారు. అటువంటి పరిస్థితులలో, మీరు భయాందోళనలకు గురవుతారు. స్కామర్‌లకు డబ్బు పంపిస్తారు. తర్వాత, మీ చిన్నారి ఫోన్‌లో లో మాట్లాడలేదని తెలుస్తుంది. మరి ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీస్తే.. అధునాతన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి వారి వాయిస్ ను క్లోన్ చేశారు. మరి వాయిస్ క్లోనింగ్ అంటే ఏమిటి? దీని ద్వారా ఎలా మోసం చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..