GDP: దేశ జీడీపీ మైన‌స్ 8 శాతంగా ఉండే అవ‌కాశం… ఫిక్కీ ఎక‌నామిక్ స‌ర్వే అంచ‌నా…వృద్ధి బాట‌లో వ్య‌వ‌సాయ రంగం…

ఫిక్కీ విడుద‌ల చేసిన ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ సర్వేలో భార‌త దేశ జీడీపీ మైనస్‌ 8 శాతంగా నమోదు కావచ్చని ప్ర‌క‌టించింది. పారిశ్రామిక, బ్యాంకింగ్‌...

GDP: దేశ జీడీపీ మైన‌స్ 8 శాతంగా ఉండే అవ‌కాశం... ఫిక్కీ ఎక‌నామిక్ స‌ర్వే అంచ‌నా...వృద్ధి బాట‌లో వ్య‌వ‌సాయ రంగం...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:07 PM

ఫిక్కీ విడుద‌ల చేసిన ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ సర్వేలో భార‌త దేశ జీడీపీ మైనస్‌ 8 శాతంగా నమోదు కావచ్చని ప్ర‌క‌టించింది. పారిశ్రామిక, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ఫిక్కీ ఈ సర్వేను చేపట్టింది. అయితే వ్యవసాయ, దాని అనుబంధ రంగాల వృద్ధిరేటు 3.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. పారిశ్రామిక, సేవా రంగాలను కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేసిందని, వీటిలో వృద్ధిరేటు మైనస్‌ 10 శాతం, మైనస్‌ 9.2 శాతంగా ఉండొచ్చ‌ని అంచ‌నా. అయితే పారిశ్రామిక రంగం వృద్ధి బాట పట్టిందని, అయితే జీడీపీలో మాత్రం ఈ స్థాయి పరుగులు కనిపించడం లేదన్నది. పర్యాటక, ఆతిథ్య, వినోద, విద్య, ఆరోగ్య రంగాలు ఇంకా కోలుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. కాగా, ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 0.5 శాతం వృద్ధిని కనబర్చవచ్చన్న ఫిక్కీ.. 2020-21లో ఐఐపీని మైనస్‌ 10.7 శాతంగా అంచనా వేసింది. అయితే హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండవచ్చన్నది.