ఒకప్పుడు అది ఉద్రిక్త సరోవర ప్రాంతం. ఇప్పుడు జవాన్ల ‘ఆనంద నిలయం’, పాంగాంగ్ సో
లడాఖ్ లోని పాంగంగ్ సో ఒకప్పుడు చైనా సైనికులు, భారత జవాన్ల పద గర్జనలు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొన్ని నెలల పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది.
లడాఖ్ లోని పాంగంగ్ సో ఒకప్పుడు చైనా సైనికులు, భారత జవాన్ల పద గర్జనలు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొన్ని నెలల పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి సరస్సు నాటి ఘర్షణలకు సాక్షిగా నిలిచింది. చైనా సైనికులు ఈ సరస్సు ద్వారా మర బోట్లలో ప్రయాణించి మన భూభాగం మీద కన్నేశారు. అయితే భారత జవాన్ల ధైర్య సాహసాలు, వారి అప్రమత్తత ముందు వారి ఆటలు సాగలేదు. వాళ్ళు తోక ముడవక తప్పలేదు. అలాంటి ఈ సరోవర ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసి.. ఈ ప్రాంతంలో చైనా సైనికుల ఉపసంహరణ జరగడంతో ఇక్కడ పూర్వపు ‘వైభవం’ ఏర్పడింది. లడాఖ్ అంటే ఉద్రిక్తతలకు నిలయమైన పాంగాంగ్ సో సరోవర ప్రాంతమనే భావన ఇప్పుడు పూర్తిగా మటుమాయమైంది. ఇందుకు ఉదాహరణగా భారత జవాన్లు ఇప్పుడు అక్కడ సేద దీరుతున్నారు. ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అప్రమత్తంగా ఉంటూనే.. కాస్త రిలాక్స్ ఫీలవుతున్నారు. బహుశా ఈ ప్రశాంతతను ఆస్వాదిస్తున్నట్టుగా ఇటీవల ఇద్దరు జవాన్లు ఇక్కడ స్టెప్పులేసి డ్యాన్స్ చేయడం విశేషం.
వారి డ్యాన్స్ ను మరికొంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ట్విటర్ లో షేర్ చేశారు..’ నా కెంతో సంతోషంగా ఉంది…గర్వంగానూ ఉంది.. ఇండియన్ ఆర్మీ గూర్ఖా జవాన్స్అండ్ ఫుల్ మ్యూజిక్’ అంటూ తన మధుర భావనలను ఆయన వ్యక్త పరిచారు. ఇక ఈ వీడియో చూసిన అనేకమంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇన్నాళ్లకు మన జవాన్లకు తీరిక దొరికింది.. భేష్ అని ఒకరంటే మన సైనికుల్లోనూ ఎంత క్రియేటివిటీ ఉందో ఈ వీడియో తెలియజేస్తోందంటూ మరికొంతమంది ప్రశంసించారు . ఓ పెప్పీ సాంగ్ కి అనుగుణంగా ఈ జవాన్లు డ్యాన్స్ చేయడం విశేషం.
It feels great whenever soldiers enjoy! Brave Indian Army Gorkha Jawans and colleagues with full music at Pangong Tso in Ladakh. pic.twitter.com/d56Qjl3RhN
— Kiren Rijiju (@KirenRijiju) March 25, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: ఆటో ఎక్కి, స్కూటర్ పై ప్రయాణించి.. బీజేపీ మహిళా కార్యకర్తలతో కోలాటం ఆడిన కేంద్ర మంత్రి
Annual Exams: ఆ ఆలోచన లేదు.. పరీక్షలు లేకుండా కష్టం.. తెలంగాణ ఇంటర్ బోర్డు