134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ‘ డేగకన్ను ‘ కోసమేనా ?

అది 1885 సంవత్సరం.. నాటి భారత ప్రభుత్వం ఢిల్లీలో ఓ చట్టాన్ని తెచ్చింది. వ్యక్తుల డిజిటల్ కమ్యూనికేషన్లు అన్నింటినీ డీక్రిప్ట్ చేయడానికి. అలాగే వారి సందేశాలను మానిటర్ లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించడానికి ఉద్దేశించిన టెలిగ్రాఫ్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పబ్లిక్ ఎమర్జన్సీ సమయంలో గానీ, ప్రజా భద్రత దృష్టా గానీ అన్ని సందేశాలను చట్టబద్ధంగా అడ్డుకోవడానికి ఈ లెజిస్లేషన్ ద్వారా ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లు లేదా ఎన్ […]

134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ' డేగకన్ను ' కోసమేనా ?
Follow us

|

Updated on: Nov 21, 2019 | 8:50 PM

అది 1885 సంవత్సరం.. నాటి భారత ప్రభుత్వం ఢిల్లీలో ఓ చట్టాన్ని తెచ్చింది. వ్యక్తుల డిజిటల్ కమ్యూనికేషన్లు అన్నింటినీ డీక్రిప్ట్ చేయడానికి. అలాగే వారి సందేశాలను మానిటర్ లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించడానికి ఉద్దేశించిన టెలిగ్రాఫ్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పబ్లిక్ ఎమర్జన్సీ సమయంలో గానీ, ప్రజా భద్రత దృష్టా గానీ అన్ని సందేశాలను చట్టబద్ధంగా అడ్డుకోవడానికి ఈ లెజిస్లేషన్ ద్వారా ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లు లేదా ఎన్ క్రిప్ట్ చేసిన మెసేజింగ్ ప్లాట్ ఫారాలు దేశంలోకి ఎంటర్ కాకముందే.. సుమారు.. వందకు పైగా సంవత్సరాలకు ముందే ఈ చట్టాన్ని చేసినప్పటికీ దీని గురించి ప్రభుత్వం ఈ వారంలో ప్రస్తావించింది. ఇటీవల టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ సంస్థ ‘ ఎన్ఎస్ఓ ‘ రూపొందించిన ‘ నిఘా ‘ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకుంటూ వాట్సాప్ సందేశాలను ప్రభుత్వం మానిటర్ చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. నాటి ఈ టెలిగ్రాఫ్ చట్టానికి, 2000 సంవత్సరపు ఐటీ చట్టానికి మధ్య భారత ప్రభుత్వం దేశంలోని అన్ని డిజిటల్ కమ్యూనికేషన్లకు సంబంధించి పూర్తి కంట్రోల్ కలిగి ఉందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లేక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఎలాంటి సమాచారాన్నయినా మానిటర్ లేదా డీక్రిప్ట్ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకుని గానీ లేదా విదేశాలతో స్నేహ సంబంధాల నేపథ్యంలోగానీ, అదీకాకుండా ఏదైనా నేర దర్యాప్తులో గానీ ఈ విధమైన అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇండియాలో డిజిటల్ హక్కుల పరిరక్షణ గ్రూపు-ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్.. పాత కాలపు టెలిగ్రాఫ్ చట్టం ప్రస్తుతానికి తగినది కాదని అంటోంది. దీని అమలుపై సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సిధ్ధపడుతోంది. ఆ చట్టం సామ్రాజ్యవాదానికి ఊతమిచ్ఛేదిగా ఉందని, అసలు డిజిటల్ డేటాకు సంబంధించినది కాదని ఈ సంస్థ కో-ఫౌండర్ అపర్ గుప్తా అంటున్నారు. ప్రభుత్వం తన చేతిలో అధికారాలను కేంద్రీకృతం చేసుకోవడానికి ఉద్దేశించి కావాలనే ఈ చట్టం తెచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ఇండియాలోని ప్రతి వ్యక్తి ప్రైవసీకి సవాలుగా మారిందన్నారు. తమ వాట్సాప్ సందేశాలన్నింటిపై నిఘా పెట్టారంటూ దేశంలోని సుమారు 19 మంది యాక్టివిస్టులు, లాయర్లు, రాజకీయనాయకులు, జర్నలిస్టులు ఆ మధ్య తీవ్ర ఆందోళన చేసిన సంగతి విదితమే. చివరకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కూడా ఈ ‘ బెడద ‘ తప్పలేదు. ఆ నేపథ్యంలో మారన్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!